Saturday, January 4, 2025
HomeCinemaPrabhas| పెళ్లి గురించి ప్ర‌భాస్ షాకింగ్ పోస్ట్.. ఆనందంలో అభిమానులు

Prabhas| పెళ్లి గురించి ప్ర‌భాస్ షాకింగ్ పోస్ట్.. ఆనందంలో అభిమానులు

Prabhas| బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ కెరియ‌ర్‌లో దూసుకుపోతున్నాడు. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం స్త‌బ్ధంగా ఉంటున్నాడు. 44 ఏళ్లు వ‌చ్చిన ఇంకా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. పెళ్లెప్పుడు అంటే టైం వ‌చ్చిన‌ప్పుడు చెబుతా అంటున్నాడు త‌ప్ప క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే తాజాగా ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టా స్టోరీలో ఊహించ‌ని పోస్ట్ ఒక‌టి పెట్టాడు.. “డార్లింగ్స్.. మొత్తానికి మన లైఫ్‌లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు.. వెయిట్ చేయండి.” అంటూ ప్రభాస్ త‌న ఇన్‌స్టా స్టోరీలో చెప్పాడు. అలా ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టా స్టోరీ పెట్టే స‌రికి అంద‌రు కూడా పెళ్లి గురించే అని సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

కాని కొంద‌రు మాత్రం పెళ్లి వార్త అయి ఉండ‌ద‌ని, సినిమా గురించి అని ముచ్చ‌టించుకుంటున్నారు. ఎందుకంటే ప్ర‌భాస్ పెళ్లి వార్త అయి ఉంటే త‌న లైఫ్‌లోకి వ‌స్తున్నారు అని చెప్పేవాడు. కాని మ‌న‌లైఫ్‌లోకి అంటే ఏదో ఉండి ఉంటుంది అని ఆలోచ‌న చేస్తున్నారు. ప్ర‌భాస్ ప‌లువురు హీరోయిన్స్‌తో ఎప్ప‌టి నుండో ప్రేమ‌లో ఉన్నాడ‌ని అనేక ప్రచారాలు జ‌రుగుతున్నా కూడా వాటిపై క్లారిటీ అయితే రావ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న యంగ్ రెబల్ రెబ‌ల్ స్టార్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని మాత్రం ప‌క్క‌న పెట్టేశాడు.

ప్ర‌భాస్ న‌టిస్తున్న కల్కి 2898 AD మూవీ కంప్లీట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పడుకునే హీరోయిన్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు టాక్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. మ‌రోవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక స‌లార్ 2 త్వ‌ర‌లో మొద‌లు పెట్ట‌నున్నాడు. మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ , హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాల‌ని త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించనున్నాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు