Friday, January 3, 2025
HomeCinemaKrithi Shetty| ఏంటి.. కృతి శెట్టి సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా.. వ‌రుడు ఎవ‌రంటే..!

Krithi Shetty| ఏంటి.. కృతి శెట్టి సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా.. వ‌రుడు ఎవ‌రంటే..!

Krithi Shetty| ఉప్పెన సినిమాతో కుర్రాళ్ల హృద‌యాలు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ చిత్రంలో బేబ‌మ్మ అనే పాత్ర‌లో క‌నిపించి కుర్రాళ్ల హృద‌యాలు కొల్ల‌గొట్టింది. ఇక ఈ సినిమా త‌ర్వాత కృతిశెట్టికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు చేసింది. ఈ సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోగా, ఆతర్వాత ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు కృతి శెట్టి అదృష్టం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టేట‌స్ తెచ్చుకున్న ఈ భామ దాదాపు డజన్ల సినిమాలను లైనప్ చేసింది..

చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోవ‌డంతో కృతి పరిస్థితి దారుణంగా మారింది.నితిన్, రామ్ పోతినేని, సుధీర్ బాబు ఇలా యంగ్ హీరోల సరసన నటించినా మంచి హిట్ అందుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం అవ‌కాశ‌ల కోసం ఎదురు చూస్తున్న కృతి శెట్టి సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ట్టు టాక్. చిన్న త‌నంలోనే ఆమె బావ‌తో ఇచ్చి పెళ్లి చేయాల‌ని వారి కుటుంబ స‌భ్యులు భావించారు. ఈ క్ర‌మంలోనే సైలెంట్‌గా త‌న బావ‌తో నిశ్చితార్థం జ‌రుపుకుంద‌ని, త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లి కూడా చేసుకోనుంద‌ని అంటున్నారు. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ స‌మ‌యంలో ఇలా పెళ్లిచేసుకోవ‌డం ఏంట‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నాయి. ఎలాగైనా తెలుగులో నిలదొక్కుకోవాలని అమ్మడు ప్లాన్. శ్రీలీల కూడా వరుస ప్లాప్స్ తో డీలా పడింది. ఈ క్రమంలో నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. రెమ్యునరేషన్ తగ్గించుకుందట. గతంలో రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి కోటి, కోటిన్నర ఇచ్చినా ఓకే అంటుందట. అలాగే గ్లామరస్ రోల్స్ కి సిద్ధం అంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు