Wednesday, January 1, 2025
HomeTelanganaTS PGECET | పీజీఈసెట్ వాయిదా.. మ‌ళ్లీ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే

TS PGECET | పీజీఈసెట్ వాయిదా.. మ‌ళ్లీ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే

హైద‌రాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ‌సీ, ఫార్మా-డీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ (TS PGECET) పరీక్ష వాయిదా ప‌డింది. గ్రూప్-1 ఎగ్జామ్స్, స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్‌ పరీక్ష తేదీల్లో స్వల్పమార్పులు చేసినట్లు జేఎన్టీయూహెచ్ వెల్ల‌డించింది. షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సి ఉన్న‌ది. అయితే ఈ ప‌రీక్ష‌ల‌ను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న‌ది.

విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, మరింత సమాచారం కోసం ఉన్నత విద్యామండలి వెబ్​సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ఈ ఏడాది మార్చి 13న పీజీఈసెట్‌నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అదేనెల 16 నుంచి మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగింది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు