Sunday, December 29, 2024
HomeCinemaMega vs Allu| మెగా, అల్లు వివాదానికి ఈ ఈవెంట్ చెక్ పెట్ట‌బోతుందా.. రేప‌టి వర‌కు...

Mega vs Allu| మెగా, అల్లు వివాదానికి ఈ ఈవెంట్ చెక్ పెట్ట‌బోతుందా.. రేప‌టి వర‌కు వెయిట్ చేయాల్సిందే..!

Mega vs Allu| చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. పుష్ప సినిమాతో ఆయ‌న‌కి నేష‌న‌ల్ స్టార్‌డం వ‌చ్చింది. పుష్ప‌2తో బ‌న్నీ క్రేజ్ ఎల్ల‌లు దాట‌డం ఖాయం అంటున్నారు. అయితే ఇదంతా అటుంచితే ఇటీవ‌ల అల్లు అర్జున్ ప్ర‌వ‌ర్త‌న‌లో కాస్త తేడా కొట్టొచ్చిన‌ట్టు కనిపిస్తుంది. అల్లు ఫ్యామిలీని ఎక్కువ‌గా ప్రొజెక్ట్ చేస్తూ మెగా హీరో ఇమేజ్ నుండి దూరం జ‌రుగుతున్నాడు. ఇక ప‌లు సంద‌ర్భాల ఆధారంగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య అంతరం ఏర్ప‌డింద‌ని ప్ర‌చారాలు సాగుతూ వ‌స్తున్నాయి. అయితే ఆ అంత‌రం అలాగే ఉందా? ఇరు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోలేదా? కొన్ని కారణాల వల్ల ఏర్పడిన గ్యాప్‌ ఇప్పటికీ కొనసాగుతోందా? అనే అనుమానాలు అంద‌రిలో మెదులుతున్నాయి.

ఇటీవ‌ల బ‌న్నీ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌కి తన మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. అయితే తన మామయ్య, జనసేన అధినేత పవన్ కల్యాణ్‍ పోరాడుతున్న జనసేనకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం మెగా అభిమానుల‌తో పాటు జ‌న‌సైనికులుకి మెగా హీరోల‌కి కూడా న‌చ్చ‌లేదు. మెగా సోదరుడు నాగబాబు అయితే త‌న సోష‌ల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా బ‌న్నీకి చుర‌క‌లు అంటించాడు. ఆ ట్వీట్ ఈ అగ్నికి కావాల్సినంత ఆజ్యం పోసేసింది. సోష‌ల్ మీడియాలో మీమ‌ర్స్ తెగ రెచ్చిపోతున్నారు.

మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ మోసం చేశారనేలా మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. అల్లు అర్జున్ అప్పుడెప్పుడో చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్ నుంచి ఆ త‌ర్వాత జ‌రిగిన విషయాలను బయటికి తీసి మీమ్స్‌తో ర‌చ్చ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అల్లు, మెగా ఫ్యామిలీ చిచ్చు హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఈ వివాదానికి రెండు ఫ్యామిలీలు ఒక ఈవెంట్ వేదికగా చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తుంది. దాసరి జ‌యంతిని సీని పెద్ద‌లు మే4న ప్ర‌తి ఏడాది జ‌రుపుతుంటారు. అయితే ఈ సారి ఎన్నిక‌ల కోడ్ వ‌ల‌న ఆ రోజు చేయ‌కుండా మే 19న ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక‌కి చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్, రామ్ చ‌రణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ రానున్నార‌ట . ఆ రోజు వీరంతా ఒక వేదిక‌పై క‌నిపించనుండ‌గా, ఆ వేడుక‌లో ఈ వివాదానికి చెక్ పెట్టాల‌ని చూస్తున్నార‌ని టాక్

RELATED ARTICLES

తాజా వార్తలు