Thursday, January 2, 2025
HomeCinemaLaya| వెంట‌ప‌డి మ‌రీ ల‌య‌ని చంపుతానంటూ బెదిరించిన ద‌ర్శ‌కుడు.. ఎవ‌ర‌త‌ను?

Laya| వెంట‌ప‌డి మ‌రీ ల‌య‌ని చంపుతానంటూ బెదిరించిన ద‌ర్శ‌కుడు.. ఎవ‌ర‌త‌ను?

Laya|  తెలుగ‌మ్మాయి అయిన ల‌య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సాధార‌ణంగా టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టం. ఇప్పుడంటే వెబ్ సిరిస్ లు వచ్చాయి కాబట్టి కాస్తో కూస్తో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ కొన్నాళ్ల క్రితం ప‌రిస్థితి వేరేలా ఉండేది. అయితే ల‌య మాత్రం మంచి అవ‌కాశాలు అందుకొని త‌న స‌త్తా చూపించింది. వేణు తొట్టెంపూడి, లయ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ స్వయం వరం. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ తర్వాత లయ కెరీర్ పూర్తిగా మారిపోగా, ఆమెని వ‌రుస‌ అవకాశాలు త‌లుపు త‌ట్టాయి. కెరీర్ మంచి పీక్స్‌లో సాగుతున్న స‌మ‌యంలోనే ల‌య పెళ్లి చేసుకుంది.

పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి జాబ్ చేసింది. డ్యాన్స్ స్కూల్ పెట్టింది. అది కూడా ఆపేసి సోష‌ల్ మీడియాలో సందడి చేయ‌డం మొద‌లు పెట్టింది. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. లయ చివరిగా టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమాలో కనిపించ‌గా, ఆ త‌ర్వాత మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. ఇక ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విష‌యాన్ని ల‌య స్వ‌యంగా తెలియ‌జేసింది. అంతే కాకుండా త‌న జీవితంలో ఎదుర్కొన్న విచిత్ర సంఘ‌ట‌న‌ల గురించి కూడా చెప్పుకొచ్చింది. స్వ‌యంవ‌రం సినిమా కోసం వేరే అమ్మాయిని అనుకున్నారని, కానీ ఆ తర్వాత తనని చూసి సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది లయ.

హీరోతో వచ్చిన హైట్ సమస్య కారణంగా తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. సినిమా చేస్తున్నంత సేపు ప్రతి సీన్లోనూ స్టూల్ ఉపయోగించే వారని పేర్కొంది ల‌య‌. నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి చాలా తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అమెరికాలో నేను ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాను అని.. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని పుకార్లు పుట్టించారు. వాటి వ‌ల‌న చాలా బాధ‌ప‌డ్డాను.ఇక ‘ఒకసారి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న డైరెక్టర్‌ ఒకరు నన్ను ఫాలో అయ్యారు. బేగంపేటలో కారు పార్కింగ్‌ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానంటూ బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. అక్క‌డికి కూడా నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. దాంతో మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండి అన్నాను’ అంటూ లయ ఆనాటి ఇబ్బందుల‌ని వివ‌రించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు