Naga Babu| మెగా బ్రదర్ నాగబాబు కొద్ది రోజుల క్రితం చేసిన ట్వీట్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తన ఆప్త మిత్రుడి కోసం ఆయన తన భార్య స్నేహారెడ్డితో కలిసి అదే పనిగా ఆయన నంద్యాలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. అయితే తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లకుండా, జనసేన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా ఫ్యామిలీలో తీవ్ర చర్చనీయాంశమైంది
అల్లు అర్జున్ వైఖరిని చాలా మంది తప్పు పట్టారు.. మెగా బ్రదర్ నాగబాబు. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించిన పోస్ట్ అది. ఈ ట్వీట్ తరువాత నాగబాబుకు అసలు సినిమా చూపించారు అల్లు అర్జున్ అభిమానులు. నాగబాబుపై ఘాటు విమర్శలు చేశారు. దీనితో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు ఆయన ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో లేకుండా పోయిన ఆయన తిరిగి సోషల్ మీడియాలో వచ్చారు
నష్టనివారణ చర్యల్లో భాగంగా నాగబాబు తలొగ్గినట్టు టాక్. ఆ ట్వీట్‌ని డిలీట్ చేసినట్టుగా మరో ట్వీట్ చేశాడు. `నేను నా ట్వీట్‌ని డిలీట్` చేసినట్టు తెలియజేశాడు. ట్విట్టర్ అకౌంట్లో నాలుగు రోజుల క్రితం పెట్టిన పోస్ట్ లేకపోవడం గమనార్హం. దాన్నే మెగాబ్రదర్ డిలీట్ చేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి, అభిమానుల నుంచి పెరిగిన ఒత్తిడి మేరకు ఆయన ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇంతటితో మెగా, అల్లు వివాదం ముగుస్తుందా? కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. కానీ కొంత కాలం పాటు ఆ గ్యాప్ అయితే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ నాగబాబు తాను ‘ఎక్స్’ నుండి ఎందుకు తప్పుకున్నట్టు? ఎవరైనా సలహా ఇచ్చారా? లేక అతనే తప్పుకున్నారా? మళ్ళీ ఎందుకు యాక్టివేట్ అయ్యారు? ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ అభిమానులు ఊరుకుంటారా? మళ్ళీ ట్రోల్ చెయ్యరా? లేక అల్లు అర్జున్ తో నాగబాబు మాట్లాడారా? ఇవన్నీ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది.