Thursday, January 2, 2025
HomeCinemaPayal Rajput| ప్ర‌భాస్ కోసం ఆ వంట వండి నా చేత్తో తినిపిస్తాను: ఆర్ఎక్స్ 100...

Payal Rajput| ప్ర‌భాస్ కోసం ఆ వంట వండి నా చేత్తో తినిపిస్తాను: ఆర్ఎక్స్ 100 భామ‌

Payal Rajput| ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ పాయ‌ల్ రాజ్‌పుత్. ఈ భామ చిత్రంలో త‌న అందంచందాల‌తో తెగ క‌వ్వించింది.ఇటీవ‌ల మంగ‌ళ‌వారం చిత్రంతో ఈ భామ మంచి హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం వరుస సినిమాల‌ను లైన్‌లో పెడుతుంది. అయితే తాజాగా ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న ఈ భామ ప్ర‌భాస్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని.. త‌న‌కోసం నా ఫేవరేట్ అయిన రాజ్మా చావ‌ల్ ను ప్ర‌భాస్‌కు వండి పెడ‌తానని చెప్పుకొచ్చింది. దీనికి యాంక‌ర్ ప్ర‌భాస్‌కు తినిపిస్తారా అని అడుగ‌గా.. నా చేతితో ద‌గ్గ‌రుండి తినిపిస్తా అంటూ తెలిపింది. దీంతో ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దీంతో పాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పాయల్ ప్రభాస్ కి ఇంత పెద్ద అభిమానా అని ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న ప్రభాస్.. డార్లింగ్స్ మీకో స్పెషల్ పర్సన్ ని పరిచయం చేస్తాను అని పోస్ట్ పెట్టడం. అదే టైంకి పాయల్ కూడా నేను కూడా ఒకరికి డార్లింగ్ ని అని పోస్ట్ పెట్టడంతో పాయల్ – ప్రభాస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో జూన్ 27న కల్కి సినిమాతో రాబోతున్నాడు. మరోవైపు రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ భారీ సినిమాల కోసం అభిమానులే కాక ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ గురించి అందరూ పొగుడుతారు. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి, ప్రభాస్ మంచితనం గురించి అభినందిస్తారు.

నిన్న ప్ర‌భాస్ ఒక‌రిని ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్ప‌డంతో డార్లింగ్ ఫ్యాన్స్ ముందు ఖుషీ అయ్యారు. కొంపదీసి పెళ్లి వార్త చెబుతున్నాడా? ఏంటి అంతా షాక్ అయ్యారు. అయితే ఆ తరువాత అదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నాడని తెలిసి నిరుత్సాహపడ్డారు. ఆ కొద్ది సేపటికే పాయల్ పోస్ట్‌తో ప్రభాస్ పోస్ట్‌ను జత చేసి ఇలా కొత్త కథలు అల్లడం మొదలెట్టేశారు. ప్రభాస్, పాయల్ మధ్య అలాంటిదేమీ ఉండదని అందరికీ తెలిసినా.. కొంత మంది ఫ్యాన్స్ మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా ఉన్నారు. ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు

RELATED ARTICLES

తాజా వార్తలు