Renu Desai | పవన్ కల్యాణ్ అభిమానులపై రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్ విడాకులు తీసుకొని పిల్లలతో కలిసి స్వతంత్రంగా జీవిస్తున్నారు. వాస్తవానికి చిన్నప్పటి నుంచే జంతువులను ఇష్టపడే రేణు దేశాయ్.. చాలా జంతువులను పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పెంపుడు జంతువులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ అభిమానులు కామెంట్ చేశారు. దీనిపై రేణుదేశాయ్ మండిపడ్డారు. ఇద్దరం విడిపోయి ఏళ్లు గడిచిపోయిందని.. ఇంకా ప్రతీదానికి ఆయనతో పోల్చడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్‌తో తనకు ఎలాంటి సమస్య లేదని.. ఆయన ఫ్యాన్స్ ప్రతిసారీ సోషల్ మీడియా అకౌంట్స్‌కు వచ్చి కామెంట్స్ పెడుతుండడం చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టిన ఎంతో మందిని బ్లాక్ చేసినా ఇంకా తనకు ఈ బెదడ తప్పడం లేదంటూ వాపోయారు. రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోకు.. ‘మీది కూడా పవన్‌లాగే గోల్డెన్ హార్ట్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ స్పందించారు. దీంతో సదరు వ్యక్తిపై రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పోస్టులను ప్రతిసారీ నా మాజీ భర్తతో ఎందుకు కంపేర్ చేస్తారు? పదేళ్ల వయసు నుంచి నాకు జంతువులంటే ప్రేమ.. నా మాజీ భర్త నాలాగా యానిమల్ లవర్ కాదు’ అంటూ తీవ్రంగానే స్పందించారు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తూ.. ఇలాంటి కామెంట్స్ బాధను, ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయంటూ వాపోయారు.