Saturday, January 4, 2025
HomeSportsVirat Kohli|ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్సీబీ.. క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌, విరాట్

Virat Kohli|ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్సీబీ.. క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌, విరాట్

Virat Kohli| ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆర్సీబీ ఒక్క‌టంటే ఒక్క‌సారి కూడా క‌ప్ అందుకోలేక‌పోయింది. ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చిన కూడా ట్రోఫీ ద‌క్కించుకోలేక‌పోయింది. ఈ సారైన క‌ప్ అందుకుంటుందా అని అభిమానులు ఆశ‌తో ఎదురు చూస్తుండ‌గా, మొద‌ట్లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో హోప్స్ పోయేలా చేశారు. కాని త‌ర్వాత బెబ్బులిలా విజృంభించి నాన్‌స్టాప్‌గా ఆరు విజయాలు అందుకున్నారు. గ‌త రాత్రి చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ జ‌ట్టు విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ చేరుకుంది. 18 ప‌రుగుల తేడాతో గెలిస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్ వెళ్లే అవ‌కాశం ఉంది. కాని 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌లో నాలుగవ బెర్త్‌ని ఖరారు చేసుకున్నారు డుప్లెసిస్ జ‌ట్టు.

అయితే ఈ గెలుపుతో ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ భావోద్వేగానికి గురవుతూ క‌నిపించారు. ఆశ‌లు లేని స్థితి నుండి ఇప్పుడు ప్లేఆఫ్స్‌కి చేరుకోవ‌డంతో విరాట్ కూడా క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోయాడు. గ్యాల‌రీలో ఉండి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన అనుష్క శర్మ కూడా ఎమోషనల్ అయ్యింది. ఆమె కళ్లు కూడా చెమ‌ర్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ ఆనందభాష్పాలు కారుస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేస్తుంది.

కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. నేడు (ఆదివారం) జరగనున్న చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఏయే జట్ల మధ్య జరుగుతాయి అనే దానిపై క్లారిటీ వ‌స్తుంది . ఆక ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మ్యాచ్​లో చాలా భావాలు కనిపించాయి. జట్టును గెలిపించలేకపోయానని ఓవైపు ధోనీ కోపంగా ఉంటే.. ఆర్సీబీ గెలిచిందన్న ఆనందంలో విరాట్​ కోహ్లీ చాలా ఎమోషనల్​ అవ‌డం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ధోని డ‌గౌట్ వెళ్తున్న‌ప్పుడు త‌న బ్యాట్‌ని గట్టిగా కింద కొట్టాడు. అంత సీరియ‌స్ అవ‌డం చాలా త‌క్కువ‌.

RELATED ARTICLES

తాజా వార్తలు