Wednesday, January 1, 2025
HomeTelanganaKU VC | కేయూ వీసీపై విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశం..

KU VC | కేయూ వీసీపై విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశం..

KU VC | కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రమేష్‌పై తెలంగాణ ప్రభుత్వం మరో విచారణకు సిద్ధ‌మైంది. ఈ సారి విజిలెన్స్ విచారణ జరుగబోతున్నది. ఈ మేరకు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజిలన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ కూడా రాసారు. వీసీగా ప్రొఫెసర్ తాటి కొండ రమేష్ పదవీ కాలం ముగుస్తున్న దరిమిలా ఆయన హాయాంలో జరిగిన నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులతో పాటు పలు విష‌యాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలు జరిగాయని గతంలో అకుట్ సంస్థ ప్రభుత్వానికి లేఖరాసింది. గత సర్కారు కూడా రమేష్‌పై విచారణ జరిపింది. అధ్యాపకుల నియామకంతో పాటు వివిధ విభాగాలలో 350 పీహెచ్‌డీ అడ్మిషన్లలో నిబంధ‌నలు అతిక్రమించారని ఆరోపణలున్నాయి. వర్సిటీలో పదోన్నతుల విషయంలోనూ ఫిర్యాదులొచ్చాయి. అయితే గత విచారణ నివేదికను పక్కనపెట్టి ఈ సారి విజిలెన్స్ ఎంక్వయిరీ జరపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే కాకతీయ విశ్వవిద్యాలయం వైస్- ఛాన్సలర్‌గా తనపై తెలంగాణా ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ ఎంక్వైరీ నీ ఆహ్వానిస్తున్నట్టు విసి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ చెప్పారు. నేను కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా నా మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఎక్కడా కూడా నిబంధనలను ఉల్లంగించలేదన్నారు. నేను ఇక్కడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగం పొంది 30 సంవత్సరాలకు పైగా పని చేశాను. కింది స్థాయి నుండి అత్యున్నతమైన వైస్ ఛాన్సలర్ గా మూడు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యూనివర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. ఆ ఫలితమే NAAC ‘A+’ గ్రేడ్. దీంతో జాతీయ స్థాయిలో యూనివర్సిటీ హోదా, ప్రతిష్టను మరింతగా పెంచినట్టు ప్రకటన విడుదల చేశారు. గత మూడేళ్ళలో యూనివర్సిటి సిబ్బందికి, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, బెనిఫిట్స్, బకాయిలు అందించానని, యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా ప్రభుత్వ సహకారంతో 507 మంది దినసరి, తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు 3 నుండి 4 రెట్లు పెంచామని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అధ్యాపకుల కొరత ఉన్నప్పటికీ 300 మందికి పైగా Ph.D అడ్మిషన్లు అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుసరిస్తూ ప్రవేశాలు కల్పించాం. దీనిపై సైతం గతంలో కొందరు వ్యక్తులు తీవ్ర ఆరోపణలు చేయడంతో తెలంగాణా ప్రభుత్వం ఒక విచార‌ణ‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది అని, ఆరోపణలు అన్నీ అవాస్తవాలు అని తేల్చిందని ర‌మేష్ గుర్తు చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు