Wednesday, January 1, 2025
HomeCinemaBharateeyudu-2 | భారతీయుడు-2 మూవీ ఆడియో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. చెన్నైలో గ్రాండ్‌గా వేడుక..!

Bharateeyudu-2 | భారతీయుడు-2 మూవీ ఆడియో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. చెన్నైలో గ్రాండ్‌గా వేడుక..!

Bharateeyudu-2 | విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సెన్సేనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న చిత్రం భారతీయుడు2. లైకా ప్రొడక్షన్స్‌తో పాటు రెడ్‌ జెయింట్‌ బ్యానర్స్‌ సుభాస్కర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కమల్, శంకర్ కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లై సెన్సేషనల్‌ హిట్‌ను సాధించి.. సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా భార‌తీయుడు-2’ తీసుకువస్తున్నారు. ఇక ఈ మూవీ జులైలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను జూన్ ఒకటిన చెన్నైలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతున్నది.

జులైలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా, ముంబయిలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ స్టూడియోలో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్రారంభించారు. భారతీయుడు-2లో కమల్‌ హసన్‌ హీరోగా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్యా, సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్‌ జయరాం, గుల్షన్ గ్రోవ‌ర్‌, స‌ముద్రఖ‌ని, బాబీ సింహ‌, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, ఢిల్లీ గ‌ణేశ్, జ‌య‌ప్రకాశ్ , మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ర‌వివ‌ర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్రన్ సంగీతం సమకూర్చారు.

RELATED ARTICLES

తాజా వార్తలు