Wednesday, January 1, 2025
HomeCinemaKajal| నా భ‌ర్త మేక‌ప్ మెన్‌కి కాల్ చేస్తాడంటూ కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్

Kajal| నా భ‌ర్త మేక‌ప్ మెన్‌కి కాల్ చేస్తాడంటూ కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్

Kajal| క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ల‌క్ష్మీ క‌ల్యాణం అనే సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయింది ..బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టి కాజల్ కొన్ని చిత్రాల్లో నటించింది. తద్వారా నేషనల్ స్టార్‌గా కూడా కాజ‌ల్‌కి గుర్తింపు ద‌క్కింది.అయితే కాజ‌ల్ పెళ్లి అయి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. వ‌రుస చిత్రాల‌లో నటిస్తూ త‌న అభిమానుల‌ని అలరించే ప్ర‌య‌త్నం చేస్తుంది. కాజల్ నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ఈ నెలాఖరుకు రిలీజ్ కానుండ‌గా, గ‌త కొద్ది రోజులుగా మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది.

ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో భాగంగా పెళ్లి తర్వాత అవకాశాలు రావడంపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్ళైతే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అని అనుకోవ‌డం త‌ప్పు. నా కెరీర్‌లో అలాంటి మార్పులు ఏమి రాలేదు. బాలీవుడ్ చూస్తే అక్కడ పెళ్లైన హీరోయిన్స్ చాలా బిజిబిజీగానే ఉంటున్నారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఆ మార్పు రావ‌ల్సి ఉంది. ఇక్క‌డ కూడా ఆ మార్పు త్వ‌ర‌లోనే వ‌స్తుంది. అందుకు ఉదాహ‌ర‌ణ నేనే .. పెళ్లి తర్వాత నా పర్సనల్ లైఫ్ లో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఎవ‌రిని మిస్ అయిన ఫీలింగ్ రావ‌డం లేదు. నా భ‌ర్త నాకు చాలా స‌పోర్టివ్‌గా ఉంటున్నారు. వీలు ఉన్న‌ప్పుడ‌ల్లా సెట్స్‌లో క‌లుస్తుంటారు.

అవ‌సరం అనుకుంటే కాల్ చేస్తారు. బిజీగా ఉంటే నా మేనేజర్ కి కానీ, మేకప్ మెన్ కి కానీ ఫోన్ చేసి విషయం చెబుతారు. నా భర్తకి నేనే ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను కాబ‌ట్టి ఎలాంటి స‌మస్య లేదు. ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ కి కూడా సమయం ఇవ్వాలి అని కాజల్ అగ‌ర్వాల్ చెప్పుకు వ‌చ్చింది.చాలా విరామం తర్వాత కాజల్ అగర్వాల్.. ‘కోస్టీ’ అనే తమిళ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌గా,ఆ చిత్రం ఈ అమ్మ‌డికి అంత హ్యాపీనెస్ ఇవ్వ‌లేదు. అనంత‌రం ‘కరుంగాపియమ్’ అనే తమిళ చిత్రాన్ని చేసింది. ఇది కూడా కాజల్‌కు మంచి సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, బాలయ్యతో చేసిన ‘భగవంత్ కేసరి’తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. ఆ జోష్‌తో సినిమాలు చేస్తుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు