Wednesday, January 1, 2025
HomeSportsMs Dhoni| నిజంగా ధోని అలా చేశాడా.. ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా వెళ్లాడా..!

Ms Dhoni| నిజంగా ధోని అలా చేశాడా.. ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా వెళ్లాడా..!

Ms Dhoni| మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని.. ఎంత టెన్ష‌న్ ఉన్న‌ప్ప‌టికీ చాలా కూల్‌గా క‌నిపిస్తారు. ఓట‌మి చెందిన కూడా ఎక్క‌డ ఫ్ర‌స్ట్రేట్ కాడు. కాని ఇటీవ‌ల ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనిలోని డిఫ‌రెంట్ యాంగిల్స్ క‌నిపించాయి. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే 18) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ఆర్సీబీ ఏకంగా 27 ప‌రుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్‌కి చేరింది. ఈ విజ‌యాన్ని ఆర్సీబీ జ‌ట్లు ఓ రేంజ్‌లో జ‌రుపుకున్నారు. ఫైన‌ల్ క‌ప్ వ‌చ్చిందా అన్నంత రేంజ్‌లో వారి సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఫ‌స్టాఫ్‌లో ఒకే ఒక్క విజ‌యం సాధించిన జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో ప్లే ఆఫ్ చేరింది.

అయితే చెన్నై ఓట‌మి మ‌హేంద్ర సింగ్ చాలా భావోద్వేగానికి గురైన‌ట్టు క‌నిపించాడు. డ‌గౌట్‌లో ధోని ముఖం చూసిన వారికి ఆయ‌న లోలోప‌ల చాలా బాధ‌ప‌డ్డట్టు అర్ధ‌మైంది. ఇక తాను ఔటైన స‌మ‌యంలో బ్యాట్‌ని బ‌లంగా కింద‌కి కొట్టి ఫ్ర‌స్ట్రేట్ కూడా అయ్యాడు.ఇక ఆర్సీబీ విజ‌యం త‌ర్వాత ధోనీ ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైర‌ల్ అవుతుండ‌గా, ఇది చూసిన వారంద‌రు ధోని నుండి ఇది ఏ మాత్రం ఊహించ‌లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆర్సీబీ ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకుంటుండ‌గా, వారి కోసం వెయిట్ చేయ‌కుండా ఆర్సీబీ సిబ్బందితో మాత్ర‌మే కరచాలనం చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు.

ఆర్సీబీ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ధోనీ వెళ్ల‌డంపై కొంద‌రు నెటిజ‌న్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.. ఐదుసార్లు కప్ గెలిచారు, అందులో నువ్వు ఒక లెజండ‌రీ ఆట‌గాడివి ఇలా చేయ‌డం ఏమైన బాగుందా అంటూ ధోనిని తిట్టిపోస్తున్నారు అయితే చెన్నై ఆటగాళ్లు ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేస్తున్న వేళ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క‌డే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి కూర్చోగా, కోహ్లీ అక్క‌డికి వెళ్లీ మ‌రి ధోనితో క‌ర‌చాల‌నం చేశాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు