Friday, January 3, 2025
HomeCinemaPayal Rajput| బ్యాన్ చేస్తామంటూ పాయ‌ల్ రాజ్‌పుత్‌ని బెదిరిస్తున్నారా.. ఎవ‌ర‌ది?

Payal Rajput| బ్యాన్ చేస్తామంటూ పాయ‌ల్ రాజ్‌పుత్‌ని బెదిరిస్తున్నారా.. ఎవ‌ర‌ది?

Payal Rajput| పాయ‌ల్ రాజ్‌పుత్ గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రంలో పాయ‌ల్ చాలా వైల్డ్‌గా క‌నిపించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు దక్కించుకుంది. నెగెటివ్ పాత్ర‌లో పాయ‌ల్ న‌ట విన్యాసానికి చాలా మంది ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమాలోని పాయ‌ల్ న‌ట‌న మెచ్చిన చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌లు అవ‌కాశాలు ఇచ్చారు. అయితే పాయ‌ల్ చేసిన ఏ సినిమా కూడా ఆమెకి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకురాలేకపోయాయి. ఈ క్ర‌మంలో ఆర్ఎక్స్ 100 చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తితో క‌లిసి మంగ‌ళ‌వారం అనే సినిమా చేసింది. ఈ సినిమా సూప‌ర్ హ‌ట్ కావ‌డంతో పాటు పాయ‌ల్‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకొచ్చి పెట్టాయి.. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ వరుస సినిమాలతో బిజీగానే ఉంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తూ ఉంటుంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ రక్షణ సినిమాని ఉద్దేశిస్తూ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. ర‌క్ష‌ణ సినిమాలో పాయల్ పోలీసాఫీసర్ గా నటించబోతుందని ఇటీవ‌ల పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమా విష‌యంలో పాయ‌ల్‌ని నిర్మాత‌లు బెదిరిస్తున్న‌ట్టు పేర్కొంది. 2019 – 2020 మధ్యలో ర‌క్ష‌ణ మూవీ షూట్ చేసాము. దాని ఒరిజినల్ టైటిల్ 5WS. రిలీజ్ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు నాకున్న పాపులారిటీని, రీసెంట్ గా వచ్చిన సక్సెస్ ని చూసి బెనిఫిట్ పొందాల‌ని భావిస్తున్నారు. ఇంక నాకు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌కుండా ప్ర‌మోష‌న్స్‌కి రమ్మ‌ని అడుగుతున్నారు.

ప్ర‌స్తుతం నేను అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్ర‌మోష‌న్స్ విష‌యంలో నా టీమ్ వారిని సంప్ర‌దిస్తే వాళ్ళు నన్ను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్స్ కి వస్తాము, నాకు ఇవ్వాల్సిన బాకీ క్లియర్ చేస్తే అని చెప్పినా కూడా వినట్లేదు. నా పేరుని డ్యామేజ్ చేసే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఇటీవ‌ల నా గురించి అస‌భ్య‌ప‌ద‌జాలంతో మాట్లాడారు. నాకు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌కుండా సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారిపై నేను లీగ‌ల్‌గా చర్య‌లు తీసుకోవాల‌ని అనుకుంటున్నాను అని పాయ‌ల్ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం పాయ‌ల్ సోష‌ల్ మీడియా పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు