Saturday, January 4, 2025
HomeCinemaKalki| ప్ర‌భాస్‌, బుజ్జీల‌ని క‌ల‌వాల‌ని అనుకుంటున్నారా.. అయితే మీరు ఏం చేయాలి అంటే..!

Kalki| ప్ర‌భాస్‌, బుజ్జీల‌ని క‌ల‌వాల‌ని అనుకుంటున్నారా.. అయితే మీరు ఏం చేయాలి అంటే..!

Kalki| ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “కల్కి 2898 AD”. సైన్స్-ఫిక్షన్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ న‌టిస్తుండ‌డంతో అభిమానులు ఈ సినిమాని చూసేందుకు ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు. ఇక జూన్ 27న సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తుండ‌గా, ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల వేగం పెంచారు. ఇటీవల కల్కి సినిమా నుంచి ప్రభాస్ బుజ్జిని రిలీజ్ చేస్తామని ప్రకటించి ఓ రోబో ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆ రోబోకి కీర్తి సురేష్ వాయిస్ చెప్పింది.

చిత్రంలో ప్ర‌భాస్ పాత్ర పేరు భైర‌వ కాగా, బుజ్జి అనేది ప్రభాస్ వాహ‌నం పేరు.మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రని కలిసి ఈ సినిమా కోసం స్పెషల్ గా బుజ్జి అనే వెహికిల్‌ని నాగ్ అశ్విన్ త‌యారు చేయించాడ‌ట‌. దీని కోసం ఏకంగా ఏడు కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తుంది. సినిమాలో యుద్ధ సన్నివేశాల్లో ప్రత్యేకంగా దీన్ని వాడతారని, ఈ వెహికల్ గాల్లోకి కూడా ఎగురుతుంది అని సమాచారం. అయితే కల్కి సినిమాలో భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్. మే 22న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సాయంత్రం 5 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌ప‌నుంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తైన‌ట్టు తెలుస్తుంది.

రామోజీ ఫిలింసిటీకి ప్రభాస్ అభిమానులు భారీగా రానుండ‌డ‌తో ఏర్పాట్లు కూడా భారీ ఎత్తునే చేసిన‌ట్టు తెలుస్తుంది. కల్కి సినిమా మొదలు పెట్టినప్పటినుంచి ఇండియాలో చేసే మొదటి ఈవెంట్ ఇదే కావ‌డంతో భారీ ఎత్తునే ప్ర‌భాస్ అభిమానులు వ‌స్తార‌ని టాక్. సినిమాను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నాగ్ అశ్విన్ . 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి అనే చెప్పాలి. ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. కల్కి ప్రమోషన్ల కోసం కొత్తగా ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే భైరవ యాడ్స్ ఇస్తున్నారు. మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగ‌గా, మ్యాచ్ మధ్యలో కల్కి నుంచి భైరవగా వచ్చి చెప్పాడు ప్రభాస్. “ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే” అంటూ ప్రభాస్ చెప్పాడు. ఇందులో ప్రభాస్ లుక్ ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇచ్చింది.

RELATED ARTICLES

తాజా వార్తలు