Ramy Krishna| రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో దాదాపు 260 చిత్రాల్లో నటించింది. 1990లో వచ్చిన “అల్లుడు గారు” తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నరమ్య.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేసిన రమ్య కెరీర్‌ని మార్చిన పాత్ర మాత్రం నీలాంబరి. దీని తర్వాత బాహుబలిలోని శివగామి పాత్ర రమ్యకృష్ణకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. సెప్టెంబర్ 15, 1967లో తమిళనాడులో జన్మించిన రమ్యకృష్ణ తమిళ సినిమా ‘వెళ్లై మనసు’తో కెరీర్ ప్రారంభించింది. పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. జనరేషన్ కు తగ్గట్టు తన శైలిని మార్చుకుంటూ అభిమానులను ఎల్లపుడు మెప్పిస్తూనే ఉంటారు రమ్యకృష్ణ.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి నటించింది రమ్య. అయితే విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న రమ్యకృష్ణ ఒకప్పుడు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంది. చాలా సినిమా అవకాశాలు కోల్పోయిందట. కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి, తర్వాత తొలగించారని, చాలా సార్లు జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనని నమ్మి అవకాశం ఇచ్చారు..అల్లరి మొగుడు సినిమా రమ్యకృష్ణకి తెలుగులో పెద్ద బ్రేక్. సినిమా వంద రోజులు ఆడింది. ఆ సందర్భంగా 100రోజుల వేడుక నిర్వహించారు.
ఇందులో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ఈ సక్సెస్‌కి కారణం కె రాఘవేంద్రరావు అని తెలిపింది. తనని చాలా మంది దురదృష్టవంతురాలు అనేవారు. కాని రాఘవేంద్రరావు నమ్మి తనకి అవకాశం ఇచ్చారు అంటూ స్టేజ్‌పైన కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె దుఃఖంతో నోట మాట రాలేదు. స్పీచ్ ఇవ్వలేని పరిస్థితులలో తాను వెళ్లి కూర్చుకుంది. అయితే తనని కాదనుకున్నవాళ్లు, తొలగించినవాళ్లు మళ్లీ నువ్వే కావాలి అని అనేలా చేస్తాను అని ఆ సమయంలోనే రమ్యకృష్ణతో అన్నాడట రాఘవేంద్రరావు అన్నట్టుగానే. ఇప్పుడు ఆమె డేట్స్ కోసం క్యూలు కడుతున్నారు.