Wednesday, January 1, 2025
HomeTelanganaKTR | రెండోసారంటే.. మోసపోయేవారిదే తప్పు : కేటీఆర్‌

KTR | రెండోసారంటే.. మోసపోయేవారిదే తప్పు : కేటీఆర్‌

KTR | ఒసారి కాకుండా రెండోసారి మోసపోయామంటే.. చేసేవారిది కాదని.. మోసపోయేవారిదేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలను డిసెంబర్ 9నే మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రైతాంగం ఆ హామీని అమాయకంగా నమ్మి ఓట్లేశారని, కాంగ్రెస్ సర్కార్‌ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో ఒకసారి నమ్మినందుకు రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసింది.. తాజాగా ఇప్పుడు ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మళ్లీ నమ్మితే మోసపోవడం తప్పదని.. అప్పుడు తప్పు కాంగ్రెస్ వాళ్లది కాదు.. వాళ్ల హామీలను నమ్మిన మనదేనని కేటీఆర్‌ అన్నారు.

ఆరు నెలల కిందట తెలంగాణలో పాలన ఎలా ఉండేదని.. ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. అప్పటి.. ఇప్పటి మార్పులను పరిశీలించాలన్నారు. ఆరు నెలల పాలనలోనే రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని గుర్తించాలన్నారు. రైతు భరోసా పేరుతో ఇస్తామన్న రూ.15వేలు ఇచ్చారా..? కౌలు రైతులకు, కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని.. మరి చేశారా? అంటూ ప్రశ్నించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు