Wednesday, January 1, 2025
HomeTelanganaకాంగ్రెస్ ప్ర‌భుత్వం పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి విమ‌ర్శ‌

కాంగ్రెస్ ప్ర‌భుత్వం పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి విమ‌ర్శ‌

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోనియా గాంధీని ఆహ్వానించ‌డాన్ని బీజేపీ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి విముఖ‌త వ్యక్తం చేశారు.

ఏ ప్రాతిపదికన సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పిలుస్తారో చెప్పాల‌ని, రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రభుత్వ కార్యక్రమమా? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా చెప్పాల‌ని అన్నారు.

ఉద్యమ సమయంలో సోనియాను దెయ్యం అన్న రేవంత్ కు.‌. సోనియా ఇప్పుడు దేవత ఎలా అయింద‌ని, 1500మంది ఉద్యమకారులను పొట్టున పెట్టుకున్నందుకు సోనియాను పిలుస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా ఎలా పాల్గొంటారని విమ‌ర్శించారు.

సోనియాను గాంధీభవన్ కు పిలిచి సన్మానం చేసుకోండి. రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వలేదు.. తెలంగాణ ప్రజలు దంచి తెచ్చుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అప్పటి ప్ర‌ధాని మన్మోహన్ సి‌ంగ్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చింద‌ని మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు