Saturday, December 28, 2024
HomeAndhra PradeshAP Elections | 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు | No Repoll

AP Elections | 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు | No Repoll

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌లో సంచ‌ల‌నంగా మారిన ఈవీఎమ్ ల ధ్వంసం ఘ‌ట‌న‌ను సీఈఓ ముఖేశ్‌ కుమార్‌ మీనా సీరియ‌స్ గా తీసుకోవ‌డంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్న‌ల్లి రామ‌కృష్ణారెడ్డి పై 10 సెక్షన్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉండ‌డంతో రీపోలింగ్ నిర్వ‌హించే అవ‌కాశం లేదు. పోలింగ్ రోజు మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు 7 వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు సీఈఓ ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

అమరావతి నుంచి ప్రత్యేక ప్రతినిధి : పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలను అందించారు. 20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయని, ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామ ని సీఈవో స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేఛ్చాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించిందని సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

ఈవీఎంలో డేటా సేఫ్‌ : ఏపీలోని మాచ‌ర్ల‌లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంద‌ని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌రించారు. పోలింగ్ నాడు మాచ‌ర్ల‌లో ఇలాంటివి 7 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని వెల్ల‌డించారు. అందులో కొంద‌రు ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన‌ట్లు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామ‌ని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంద‌రిని గుర్తించాల్సి ఉంద‌ని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘ‌ట‌నల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు. 20వ తేదీన రెంట‌చింత‌ల కోర్టులో ఎస్ఐ మెమో దాఖ‌లు చేయ‌డంతో పాటు మొద‌టి నిందితుడిగా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ది సెక్ష‌న్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టిన‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు ఏడేళ్ల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు