RR vs RCB| ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈ సీజన్లో అద్భుతాలు చేస్తుందని అందరు భావించారు. అందుకు కారణం ఈ సీజన్ ఫస్టాఫ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచి సెకండాఫ్ లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కి చేరుకోవడం మనం చూశాం. వరుసగా 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం బోర్లబొక్కన పడింది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్స్ సరైన ప్రదర్శన కనబరచకపోవడంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక సునాయాసంగా గెలిచిన ఆర్ఆర్ జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్ఆర్ తలపడనుంది.
ముందుగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌కి దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 33 పరుగులు), రజత్ పాటిదార్ (22 బంతుల్లో 34 పరుగులు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32 పరుగులు) మాత్రమే కాస్తో కూస్తో పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి ఓ వికెట్ దక్కించుకున్నాడు. చాహల్, సందీప్ శర్మ తలా ఓ వికెట్ దక్కింది.
లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలోనే 6 వికెట్లకు 174 పరుగులు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 30 బంతుల్లోనే 45 పరుగులు చేసాడు.ఇక మరో ఓపెనర్ టోమ్ కోహ్లెర్ కాడ్మోర్ (20) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (13 బంతుల్లో 17 పరుగులు) కాస్త నెమ్మదిగా ఆడాడు. పదో ఓవర్లోనే కర్ణ్ శర్మ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో 10 ఓవర్లలో 86 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది కష్టాలలో పడింది ఆర్ఆర్ జట్టు. ఆ తర్వాత వచ్చిన జురెల్ (8) రనౌట్ అయ్యాడు. ఇక ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 36 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు పరాగ్. షిమ్రన్ హిట్మైర్ 14 బంతుల్లోనే 26 పరుగులు కూడా స్కోరు బోర్డ్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే, 18వ ఓవర్లో పరాగ్, హిట్మైర్ను సిరాజ్ ఔట్ చేయటంతో మ్యాచ్ కాస్త టెన్షన్ పుట్టించింది. చివర్లో వచ్చిన చివర్లో రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, ఓ సిక్స్) వేగంగా ఆడి తమ జట్టుని గెలిపించాడు. అయితే బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఓటమి చెందడానికి ముఖ్య కారణం ఫీల్డింగ్‌లో తీవ్రంగా తడబడడం. మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడమే కాక ఫీల్డింగ్‌లోను తడబడ్డారు.