Saturday, January 4, 2025
HomeTelanganaKTR | విద్యావంతుడు రాకేశ్ రెడ్డికే మ‌న ఓటు.. కేటీఆర్

KTR | విద్యావంతుడు రాకేశ్ రెడ్డికే మ‌న ఓటు.. కేటీఆర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సంద‌ర్బంగా కేటీఆర్ కామెంట్స్ –

🔹కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను పట్టుకొని ఈ సీఎం రాచరికం పోకడలంటాడు. కాకతీయ కళాతోరణాన్ని రాజచిహ్నం నుంచి తీసేస్తారంట.

🔹మళ్లీ ఆయనే జయ జయహే తెలంగాణ గీతాన్నిరాష్ట్ర గీతంగా ప్రకటించారు.

🔹ఆయన చెప్పిన జయ జయహే తెలంగాణ గీతంలోనే కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి.

🔹అవి కూడా తెల్వని సన్నాసి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు. అది మన ఖర్మ.

🔹2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు చేసింది గాడిద గుడ్డు మాత్రమే. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలే.

🔹కానీ 30 వేల ఉద్యోగాలు నేను ఇచ్చినా అంటాడు. కానీ ఒక్క నోటిఫికేషన్ లేకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చిండో చెప్పాడు.

🔹ప్రపంచంలోనే ఏ మేజిషియన్ కు కూడా సాధ్యం కాని విధంగా మ్యాజికల్ గా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల నుంచి 30 వేల ఉద్యోగాల కోత పెడుతున్నాడు.
🔹రేవంత్ రెడ్డంతా సిగ్గు మాలిన, పనికి మాలిన సీఎం దేశంలోనే ఇంకొకడు లేడు.

🔹ఎంట్రన్ ఎగ్జామ్స్ ఉచితం అన్నారు. టెట్ కు గతంలో రూ. 400 ఫీజు ఉంటే రేవంత్ రెడ్డి విమర్శలు చేశాడు. కానీ ఇప్పుడు టెట్ ఫీజును రూ. 2 వేలు చేశారు.

🔹జాబ్ ల సంగతిని రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసిండు. జాబ్ లు ఇచ్చే పరిస్థితి లేదు.

🔹ఆయన జాబ్ గురించే ఫికర్ లో ఉన్నాడు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోదునా అని ఆలోచిస్తున్నాడు.

🔹ఏమైంది నువ్వు ఇస్తానన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని అడగాలంటే దమ్మున్న రాకేష్ రెడ్డి గెలవాలె.

🔹సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చే లంగలు, దొంగలు, బ్లాక్ మెయిలర్లు, చీటర్లకు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.

🔹విద్యావంతుడు రాకేష్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని ఆయన చెబుతున్న మాటలను కూడా విద్యావంతులు ఆలోచించాలె.

🔹సమాజానికి టార్చ్ బేరర్ లాంటి వాళ్లు విద్యావంతులు. మీ ప్రతినిధులుగా ఎవరు ఉండాలో మీరే ఆలోచించాలె.

🔹ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కైన ఎంజీఎం హాస్పిటల్ లో నిన్న 5 గంటలు కరెంట్ పోయింది.

🔹ఎంజీఎం లాంటి హాస్పిటల్ లో 5 గంటలు కరెంట్ లేకపోతే నవజాత శిశువులు, ఐసీయూలో పేషెంట్లు చనిపోతే ఎవరిది బాధ్యత.

🔹రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండు. 21 వందలు 83 రూపాయలు ఉన్న వడ్లకు రూ. 500 బోనస్ అన్నాడు.

🔹దొడ్డు వడ్లకే కాదా రూ. 21 వందల 83 రూపాయలు ఉన్నది.

🔹కానీ ఇప్పుడు మాత్రం సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండు.

🔹సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ సన్నాసులకు బుద్ధి చెప్పాలె.

🔹ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు ఉన్నప్పుడే ఇచ్చిన హామీలను భయంతో అమలు చేస్తారు.

🔹కాంగ్రెస్ వస్తే మోసపోతాం. గోసపడతాం అని ఆరు నెలల కిందట మేము చెప్పాం.

🔹కానీ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి, భూతల స్వర్గం అనే మటాలు చెప్పి అధికారంలోకి వచ్చింది.

🔹అప్పుడప్పుడు మార్పు మంచిదే. కానీ తెలంగాణలో ఎలాంటి మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలె.

🔹కాంగ్రెసోళ్లు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు ఒక్కసారి గుర్తుచేసుకోండి.

🔹డిసెంబర్ 9 నాడు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు.

🔹మరి ఇప్పటికే ఆరు నెలలు కావస్తోంది. మరి రుణమాఫీ జరిగిందా?

🔹కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లు వేసే సమయానికి రైతుబంధు వచ్చేది. కానీ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసే నాడు రైతుబంధు గుర్తుకు వస్తోంది.

🔹కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం అన్నాడు. ఒక్కరికైనా వచ్చిందా?

🔹వరంగల్ లో కూడా ఐటీ సంస్థలను తెచ్చాం. టెక్ మహీంద్రా, జెన్ పక్ట్ వంటి సంస్థలు వచ్చాయి.

🔹ఇప్పుడు వరంగల్ నుంచి ఐటీ సంస్థలు వెళ్లిపోతున్నాయి. ఇదేనా మనం కోరుకున్న మార్పు?

🔹కంపెనీలు పోవుడు, హాస్పిటల్ లో కరెంట్ పోవుడు. ఇదేనా కాంగ్రెస్ వస్తే వచ్చినా మార్పు?

🔹ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాకా ఊదేటోళ్లు కాదు. వాళ్ల బాజా భజయించేటోళ్లు కావాలె.

🔹ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలైనయ్ అంటూ తెంపరితనంతో రేవంత్ రెడ్డి చెబుతున్నాడు.

🔹మహిళలకు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పచ్చి అబద్దాలు చెబుతున్నారు.

🔹ఇన్ని అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీని గల్లా పట్టి నిలదీయాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యం.

🔹తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ను ప్రశ్నిస్తాడా? ఆయన ప్రశ్నిస్తే పార్టీ నుంచి తన్ని గెంటేస్తారు.

🔹ఇటు బిట్స్ పిలానీ. అటు పల్లి బఠాణీ. బ్లాక్ మెయిలర్, చీటర్.

🔹రాకేష్ రెడ్డి గెలిస్తే ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను తీసుకొచ్చి విద్యార్థులను మోటివేట్ చేస్తడు.

🔹మల్లన్న గెలిస్తే చంచల్ గూడ జైల్లో ఉన్న ఆయన సీనియర్ ఖైదీలను తీసుకొస్తాడు.

🔹ఇలాంటి దొంగలను చట్ట సభలకు పంపిస్తే ఆ సభలకే గౌరవం లేకుండా పోతుంది.

🔹కేసీఆర్ గారు కౌన్సిల్ కు ఎంతో మంది విద్యావంతులు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్లను పంపించారు.

🔹కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్, తెల్లారి లేస్తే పెద్దవాళ్లను బూతులు తిడితే పెద్దవాన్ని అయిపోతా అనుకునే వ్యక్తి.

🔹బూతులు తిడుతు దానికి వచ్చిన లైకులు చూసుకుంటూ సంబరపడే సన్నాసిని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

🔹అమెరికాలో ఎంతో సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణకు సేవ చేసేందుకు ఇక్కడకు వచ్చారు.

🔹చదువుకున్న వ్యక్తి రాకేష్ రెడ్డి కి ఓటు వేస్తే చాలా మంది కొత్త విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తారు.

🔹కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే వారిని ఎన్నుకోవద్దు.

🔹మన పార్టీ అభ్యర్థైన రాకేష్ రెడ్డి ని గెలిపించే బాధ్యతను బీఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాలె.

🔹రాకేష్ రెడ్డి గారు గెలిస్తే వరంగల్ లో బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన తోడుగా ఉంటాడు.

🔹మూడో వరుసలో ఒకటి నంబర్ రాసి రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థన.

🔹మీ ఫ్రెండ్స్, బంధువులకు కూడా మెసేజ్ చేసి విద్యావంతులకు అవకాశం కల్పించాలని కోరండి అని కేటీఆర్ విన్న‌వించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు