Saturday, January 4, 2025
HomeTelanganaHarish Rao | వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Harish Rao | వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

జగిత్యాల జిల్లాలోని పూడూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంద‌ర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ బాధ‌ల‌ను మంత్రి హ‌రీష్ రావుకు చెప్పుకున్నారు.

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అని రైతులు తెలిపారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు అన్నారు. తమ పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు