Wednesday, January 8, 2025
HomeCinemaShruti Hassan| ముచ్చ‌ట‌గా మూడో బ్రేక‌ప్..మ‌రొక‌రితో మింగిల్ అయ్యేందుకు సిద్ధం అంటున్న శృతి

Shruti Hassan| ముచ్చ‌ట‌గా మూడో బ్రేక‌ప్..మ‌రొక‌రితో మింగిల్ అయ్యేందుకు సిద్ధం అంటున్న శృతి

Shruti Hassan|  ఇటీవ‌లి కాలంలో రిలేష‌న్స్ ఎక్కువ కాలం నిల‌బ‌డ‌డం లేదు. చిన్న చిన్న విష‌యాల‌కి బ్రేక‌ప్ చెప్పుకుంటున్నారు. న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండాల్సిన సెల‌బ్స్ కూడా ఇలా చేస్తుండ‌డం ఏం బాలేదు. అయితే ఇప్పుడు రిలేష‌న్ బ్రేక‌ప్ అని జ‌నాల‌కి తెలిసేందుకు సోష‌ల్ మీడియా ద్వారానే హింట్ ఇస్తుండ‌డం విశేషం. మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. అలాగే అక్కినేని నాగ చైతన్యను సమంత అన్ ఫాలో అయ్యింది. ప‌లువురు ముంబై సినీ జనాలు కూడా అలానే చేశారు. దాంతో అభిమానుల‌కి వీరు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌క‌ముందే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇక శృతి హాసన్ కొద్ది రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి శాంతను హజారికా ఫోటోలను డిలీట్ చేసింది.

అంతే కాదు అతడిని అన్ ఫాలో చేసింది. శాంత‌ను కూడా శృతిని అన్ ఫాలో అయ్యాడు. దీంతో జ‌నాల‌కి డౌట్ మొద‌లైంది. శాంతనుతో ఆవిడ బ్రేకప్ న్యూస్ నెల క్రితం బయటకు రాగా, దాని గురించి వీరిద్ద‌రిని ప్ర‌శ్నించిన ఎలాంటి స‌మాధానం రాలేదు. కాని తాజాగా శృతి హాస‌న్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వ‌హించింది. ఈ సెష‌న్‌లో ఓ నెటిజ‌న్.. ‘సింగిల్ ఆర్ కమిటెడ్’ అని అడిగాడు. అప్పుడు శృతి హాసన్ ”నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ, ఇప్పుడు నేను సింగిల్. మింగిల్ అవ్వటానికి రెడీగా ఉన్నాను. అంటూ చెప్పుకొచ్చింది. అంటే శాంత‌నుకి కూడా శృతి బ్రేకప్ చెప్పింద‌ని మ‌రో వ్య‌క్తితో మింగిల్ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్టు జ‌నాల‌కి అర్ధ‌మైంది.

గ‌తంలో శృతి హాస‌న్.. ధ‌నుష్‌తో కొన్నాళ్ల పాటు ప్రేమాయ‌ణం సాగించింది. ఆ విష‌యం ధ‌నుష్ భార్య ఐశ్వ‌ర్య‌కి తెలియ‌డంతో ఆమె గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇద్ద‌రు విడిపోయారు. అనంత‌రం శృతి హాస‌న్ ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేతో కొన్నాళ్ల పాటు రిలేష‌న్ లో ఉంది. అనుకోని కార‌ణాల వ‌ల‌న అత‌నికి బ్రేక‌ప్ చెప్పి డూడుల్ ఆర్టిస్ట్ శాంత‌ను ప్రేమ‌లో మునిగి తేలింది. ఈ ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ ఓ రేంజ్‌లో ఉండేది.ఇప్పుడు అత‌నికి బ్రేక‌ప్ చెప్పిన శృతి హాసన్ సినిమాల‌పై దృష్టి పెడ‌తానంటుంది. ఇప్పుడు శృతి హాసన్ చేతిలో ‘సలార్ 2’, అడివి శేష్ ‘డెకాయిట్’, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలి’తో పాటు ఓ హిందీ సినిమా కూడా ఉంది.

RELATED ARTICLES

తాజా వార్తలు