Wednesday, January 1, 2025
HomeNationalLok Sabha Elections | ఆరో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్రారంభం..

Lok Sabha Elections | ఆరో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్రారంభం..

Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్ శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 889మంది అభ్యర్థులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. 11.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ విడతలోనే హర్యానాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, దిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఈ విడతలోనే ఎన్నిక జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్ 8, బంగాల్ 8, ఒడిశా 6, ఝార్ఖండ్ 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్నింటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్యే పోరు నెలకొంది. పొత్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4, కాంగ్రెస్‌ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అన్ని స్థానాల్లో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన అనంతనాగ్‌-రాజౌరీ స్థానంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఈసీ బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లుచేసింది. మరోవైపు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్‌ జరగుతుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు