Viral Video | దొంగలు ఎంతకైనా తెగించి దోపిడీకి పాల్పడుతుంటారు. రైళ్లల్లో, బస్సుల్లో నిత్యం ఏదో ఒక చోరీలు జరుగుతూనే ఉంటాయి. పార్కింగ్ చేసిన కార్లలోనూ చోరీలకు పాల్పడుతుంటారు. దారి పొడవునా వెళ్లే వాహనాలను ఆపి.. అందులో ఉన్నవారిని కత్తులతో బెదిరించి నగదు, విలువైన వస్తువులను అపహరిస్తుంటారు. అయితే ఈ దొంగలు మాత్రం కదులుతున్న ట్రక్కులో నుంచి సామాన్లను దొంగిలించారు. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆగ్రా – ముంబై జాతీయ రహదారిపై ఓ ట్రక్కు సామాన్లతో వేగంగా వెళ్తుంది. ఆ ట్రక్కుపై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ట్రక్కు వెనుకాలే మరో యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. అయితే ట్రక్కులో నుంచి సామాన్లతో కూడి ఉన్న ఓ సంచిని కిందకు పడేశారు. అనంతరం సినీ ఫక్కీలో ఒకరి తర్వాత మరొకరు బైక్‌పై దిగారు. అత్యంత ప్రమాదకరమైన ఈ స్టంట్ గగుర్పాటుకు గురి చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ వద్ద చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అదే దారిలో వెళ్తున్న ఓ వాహనదారుడు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధూమ్ చిత్రంలో చూపించిన దోపిడీ సీన్లూ ఈ స్టంట్ ముందు దిగదుడుపే అంటూ కామెంట్లు చేశారు.
ये वीडियो आगरा-मुंबई नेशनल हाईवे पर मध्यप्रदेश में शाजापुर जिले की है। बाइक सवार 3 चोर चलते ट्रक से सामान चुरा रहे हैं। हालांकि इस घटना में ऐसा भी लगता है, जैसे ट्रक ड्राइवर की मिलीभगत हो। चोरी होने तक ट्रक साइड चलता रहा। चोरी पूरी होते ही ट्रक की साइड बदल गई… pic.twitter.com/FfhIZHpJps
— Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2024