Saturday, January 4, 2025
HomeCinemaPrabhas| అభిమాని మృతితో త‌ల్లడిల్లిన ప్రభాస్.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Prabhas| అభిమాని మృతితో త‌ల్లడిల్లిన ప్రభాస్.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Prabhas| యంగ్ రెబ‌ల్ స్టార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.ప్ర‌భాస్ నుండి వ‌స్తున్న క‌ల్కి కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ కోసం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇటీవ‌ల బుజ్జి లాంచ్ గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ లాంచ్ ఈవెంట్ లో ప్ర‌భాస్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించి సంద‌డి చేశారు. అయితే ప్ర‌భాస్ న‌టుడిగానే కాదు మంచి మ‌న‌సున్న మనిషిగాను అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుంటాడు.ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చిన వారికి ఫుడ్ పెట్టి పంపిస్తారు . వద్దన్నా మరీ.. అన్ని వెరైటీలు చేసి మరీ తినిపిస్తారు. ప్రభాస్ తో పని చేసేవారు చాలా మంది ప్రభాస్ అతిథ్యం గురించి చెప్పుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి.

ప్రభాస్‌ తో పనిచేసిన చాలామంది హీరోయిన్లు, కో యాక్టర్స్.. ప్రభాస్ ఆతిథ్యం తీసుకుని.. చాలా సంతోషించిన సంద‌ర్భాలు ఉన్నాయి. వారు సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ ఆతిథ్యం గురించి క‌థ‌లుగా క‌థ‌లుగా రాసేవారు. ఇక ప్ర‌భాస్ ఆప‌ద‌లో ఉన్న వారికి కూడా సాయం చేస్తుంటారు. అభిమానులకి ఎలాంటి స‌మస్య వ‌చ్చిన వెంట‌నే స్పందిస్తుంటారు. కోవిడ్ సంక్షోభంలో ప్రభాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఎత్తున విరాళాలు ఇవ్వ‌డం మ‌నం చూశాం. కేంద్రానికి రూ. 3 కోట్లు ఇచ్చారు. అలాగే ఏపీ/తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇటీవల తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కి రూ. 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా ఎన్నో గుప్త‌దానాలు చేశారు.

తాజాగా ప్రభాస్ అభిమాని మృతి వార్త తెలుసుకొని వెంట‌నే స్పందిస్తూ ఆర్థిక సహాయం అందించారు. కరీంనగర్ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఆయ‌న అభిమాన న‌టుడి పేరుతో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అయితే ఆయ‌న ఇటీవ‌ల మ‌ర‌ణించ‌గా, వెంట‌నే ప్ర‌భాస్ ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్ర‌భాస్ మంచి మ‌నస్సుపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు