Tuesday, December 31, 2024
HomeBusinesse-PAN | ఇలా చేస్తే ఈజీగా ఈ-పాన్ కార్డ్‌.. అదీ ఉచితంగానే..

e-PAN | ఇలా చేస్తే ఈజీగా ఈ-పాన్ కార్డ్‌.. అదీ ఉచితంగానే..

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డ‌బ్బులు జ‌మ చేయాల‌న్నా, విత్‌డ్రా చేయాల‌నుకున్నా.. ఐటీ రిట‌ర్నులు ఫైన్ చేయాల‌న్నా, ఏదైనా లోన్ తీసుకోవాల‌న్నా.. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాఫీగా జ‌ర‌గాల‌న్నా పాన్‌కార్డ్ (PAN Card) ఉండాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కు పాన్‌కార్డ్ లేనివారు, కొత్త‌గా కార్డు కావాల‌నుకున్న వారు కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో త‌క్ష‌ణ‌మే పాన్ నంబ‌ర్ అవ‌స‌ర‌మైతే.. ఏం చేయాలి. ఇలాంటి వారికోస‌మే ఈ-పాన్ (e-PAN). అలాంటివారి కోస‌మే ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ స‌దుపాయాన్ని అందిస్తున్న‌ది. త‌క్కువ స‌మ‌యంలో ఈ-పాన్ నంబ‌ర్‌ను జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. అది ఎలాంటే..

  • ముందుగా ఆదాయ‌పు ప‌న్నుశాఖ పోర్ట‌ల్‌కు వెళ్లాలి.
  • స్క్రీన్‌పై ఎడ‌మ‌వైపు క‌నిపించే Quick Linksసెక్ష‌న్‌లో Instant e-PAN అని ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
  • వెంట‌నే Get New e-PAN అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. మీ ఆధార్ కార్డ్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి కింద క‌నిపించే I Confirm That చెక్‌బాక్స్‌పై టిక్ చేసి Continueపై క్లిక్ చేయాలి.
  • మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దానిని ఎంట‌ర్ చేయ‌గానే వ్య‌క్తిగత వివ‌రాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
  • ఆ వివ‌రాలు స‌రిగ్గా ఉన్నాయో, లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. త‌ర్వాత I Accept that చెక్ బాక్స్‌ను ఎంచుకుని Continue పై క్లిక్ చేయాలి. అంతే మీ ఇన్‌స్టంట్ పాన్ కోసం ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన‌ట్లే.
  • ఆ త‌ర్వాత మీకో ఎక్నాలెడ్జ్‌మెంట్ నంబ‌ర్ వ‌స్తుంది. దాన్ని జాగ్ర‌త్త‌గా రాసుకోవాలి.
  • ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబ‌ర్‌కు క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది. అది రాగానే Get New e-PAN ప‌క్క‌నే ఉన్న Chek Status లేదా Download PAN ఆప్ష‌న్ ఎంచుకోవాలి.
  • అక్క‌డ ఆధార్ నంబ‌ర్‌, ఓటీపీ ఎంట‌ర్ చేయ‌గానే మీ పాన్ అప్‌డేట్‌కు సంబంధించిన వివ‌రాలు క‌నిపిస్తాయి. అక్క‌డే View e-PAN, Download e-PAN ఆప్ష‌న్లు ఉంటాయి. వాటి స‌హాయంతో ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

దీనిని ఐటీ శాఖ వారు ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేస్తారు. దానిపై డిజిట‌ల్ సంత‌కం ఉంటుంది. ఇదంతా పూర్తిగా ఉచితంగా చేసుకోవ‌చ్చు. కాగా, ఇప్ప‌టికే మీకు పాన్ కార్డు ఉంటే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ద్దు. ఎందుకంటే ఒక‌టికంటే ఎక్కువ పాన్‌కార్డు ఉంటే రూ.10 వేలు జ‌రిమానా కట్టాల్సి ఉంటుంది.. జాగ్ర‌త్త మ‌రీ.

RELATED ARTICLES

తాజా వార్తలు