Wednesday, January 1, 2025
HomeTelanganaప్ర‌జా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు.. మ‌రికాసేప‌ట్లో పేలుతుందంటూ హెచ్చ‌రిక‌

ప్ర‌జా భ‌వ‌న్‌కు బాంబు బెదిరింపు.. మ‌రికాసేప‌ట్లో పేలుతుందంటూ హెచ్చ‌రిక‌

హైద‌రాబాద్ : బేగంపేట‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. ప్ర‌జా భ‌వ‌న్‌లో బాంబు పెట్టామ‌ని, ప‌ది నిమిషాల్లో అది పేలిపోతుందంటూ ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌జా భ‌వ‌న్ సిబ్బందికి స‌మాచారం అందించారు. ఈ క్ర‌మంలో ప్ర‌జా భ‌వ‌న్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్ర‌జా భ‌వ‌న్‌ను త‌మ ఆధీనంలోకి తీసుకుని, క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేస్తున్నారు. ప్ర‌జా భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లోనే డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నివాసం ఉంటున్నారు.

ఇటీవ‌ల ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు