NTR | విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకు భారత రత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ 101 జయంతి. ఈ క్రమంలో ఆయనకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. ఈ క్రమంలో చిరంజీవి సైతం ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్‌పెట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వడం సముచితమంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ.. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను.
తెలుగువారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా చిరంజీవి చిరంజీవి-ఎన్‌టీఆర్ కాంబోలో ‘తిరుగులేని మనిషి’ సినిమా వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్‌లోనే స్టార్లుగా ఎదిగారు. అయినా.. కలుసుకున్న సందర్భంలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునే వారు. ఆ స్నేహాన్ని నందమూరి బాలకృష్ణ సైతం చిరంజీవితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024