Wednesday, January 1, 2025
HomeTelanganaపౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... కాంగ్రెస్ స‌ర్కార్‌పై సమరశంఖం పూరిస్తాం..! : కేటీఆర్

పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా… కాంగ్రెస్ స‌ర్కార్‌పై సమరశంఖం పూరిస్తాం..! : కేటీఆర్

హైద‌రాబాద్ : రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం ఉండ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమ‌ర్శించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తెహజీబ్‌కి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట అని కేటీఆర్ మండిప‌డ్డారు.

కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి. “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా..? అని కేటీఆర్ నిల‌దీశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు