Thursday, January 2, 2025
HomeCinemaPushp2| పుష్ప‌2 సాంగ్ విడుద‌ల‌..క‌పుల్ సాంగ్ కుమ్మేస్తుందిగా...!

Pushp2| పుష్ప‌2 సాంగ్ విడుద‌ల‌..క‌పుల్ సాంగ్ కుమ్మేస్తుందిగా…!

Pushp2| అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న మూవీ పుష్ప 2..మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఆగ‌స్ట్ 15న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. పుష్ప పార్ట్ వ‌న్ భారీ స‌క్సెస్‌గా నిలిచిన నేప‌థ్యంలో సీక్వెల్ కోసం తెలుగు ప్రేక్ష‌కులతో పాటు దేశ‌వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తోన్నారు. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఇటీవ‌ల పుష్ప 2 మూవీ నుంచి మే 1న పుష్ప‌..పుష్ప అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కి మంచి కిక్కిచ్చింది. ఈ పాట యూట్యూబ్‌లో 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ చెప్పారు. అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వ‌చ్చిన‌ట్టు తెలియ‌జేశారు.

ఇటీవ‌లి కాలంలో తెలుగులో అత్య‌ధిక వ్యూస్‌ను ద‌క్కించుకున్న సాంగ్‌గా పుష్ప ఫ‌స్ట్ సింగిల్ నిలిచింది. ఇక కొద్ది సేప‌టి క్రితం పుష్ప‌2 నుండి మ‌రో సాంగ్ విడుద‌ల చేశారు. సూసేకీ అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే ఈ పాట లిరికల్ సాంగ్ ఫుల్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ సాంగ్ చిత్రీకరణ సెట్స్ లో రష్మిక, అల్లు అర్జున్ డాన్స్ ప్రాక్టీస్ వీడియోను పంచుకుంది. రిలీజైన కొద్ది నిమిషాల‌లోనే ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచింది. సూసేకీ పాట‌కు శ్రేయ ఘోష‌ల్ గానం అందించారు. చంద్ర‌బోస్ ఈ పాట‌కు సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు.

ఈ పాట‌లో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న కెమిస్ట్రీ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో ఐకానిక్‌ డ్యాన్స్ స్టెప్పుల‌తో పుష్ప‌రాజ్‌, శ్రీవ‌ల్లి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నారు. దేవిశ్రీప్ర‌సాద్ త‌న మ్యూజిక్‌తో అద‌ర‌గొట్టాడు. తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డం, త‌మిళంతో పాటు మొత్తం ఆరు భాష‌ల్లో సూసేకీ పాట‌ను రిలీజ్ చేయగా, ఆరు భాష‌ల‌లో శ్రేయో ఘోషాల్ పాడ‌డం విశేషం. ఈ పాట‌కి కూడా మంచి రెస్సాన్స్ రానుంది. ప్ర‌స్తుతం శ్రేయోఘాషాల్ పాడిన పాట వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు