Wednesday, January 1, 2025
HomeCinemaVV Vinayak| ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న వివి వినాయక్.. ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారా..!

VV Vinayak| ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న వివి వినాయక్.. ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారా..!

VV Vinayak| మాస్ డైరెక్టర్ వివి వినాయ‌క్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కి ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. ఆయ‌న చేసే సినిమాల‌లో ప్ర‌త్యేక‌మైన శైలి ఉంటుంది.చిరంజీవి రీఎంట్రీ చిత్రం కూడా వివి వినాయ‌క్‌తో చేశారంటే ఆ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఒక‌ప్పుడు టాప్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన వివి వినాయ‌క్ ఇటీవ‌ల కాలంలో పెద్ద‌గా సినిమాలు చేయడం లేదు. చివ‌రిగా బాలీవుడ్‌లో ఛ‌త్ర‌ప‌తి అనే సినిమా చేశాడు. ఆ త‌ర్వాత చిరంజీవి, బాల‌య్య‌తో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాని దానిపై ప‌క్కా క్లారిటీ అయితే రాలేదు.

అయితే వీవీ వినాయక్ ఆరోగ్యం బాగోలేదు అన్న వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వినాయ‌క్ జీర్ణ సంబంధింత సమస్యలతో భాదపడుతున్నార‌ని, ప్ర‌స్తుతం అత‌నికి ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో వివి వినాయక్ ఇంటికే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. శారీరకంగా బాగా తగ్గిపోయారు అని కూడా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దీనిపై వినాయ‌క్ సోద‌రుడు స్పందించారు. ఆ వార్త‌ల‌ని ఖండిస్తూ.. ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నార‌ని క్లారిటీ ఇచ్చారు. అవి ఇప్ప‌టివి కాద‌ని, గ‌తంలో వ‌చ్చిన ఆరోగ్య స‌మ‌స్య‌లు అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే వీవీ వినాయ‌క్ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నార‌ని, త్వరలోనే ఆయన నంది హిల్స్ లోని తన ఆఫీస్ కి ఎప్పటిలాగే వస్తారు అని తెలిపారు. అభిమానులు కూడా వినాయక్ స్వయంగా తన హెల్త్ గురించి క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. త్వ‌ర‌లోనే వివి వినాయ‌క్ స్వ‌యంగా మూవీ అప్‌డేట్ గురించి క్లారిటీ ఇవ్వాలంటూ అభిమానులు కోరుతున్నారు. . దిల్ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా సీన‌య్య అనే సినిమా స్టార్ట్ కాగా, ఈ మూవీ గురించి ఇంత వ‌ర‌కు అప్‌డేట్ లేదు. ఆ సినిమా క్యాన్సిల్ అయిందా లేదంటే ఇంకా వ‌ర్క్ న‌డుస్తుందా అనేది తెలియ‌రావ‌డం లేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు