Thursday, January 2, 2025
HomeCinemaVishwak Sen| ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌ల‌తో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్న విశ్వ‌క్.. ఇదెలా సాధ్యం

Vishwak Sen| ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌ల‌తో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్న విశ్వ‌క్.. ఇదెలా సాధ్యం

Vishwak Sen| నంద‌మూరి ఫ్యామిలీ పేరు ప్ర‌ఖ్యాత‌లు నిలబెట్టిన వాళ్ల‌లో బాల‌కృష్ణ‌, జూనియర్ ఎన్టీఆర్ త‌ప్ప‌క ఉంటారు. బాల‌య్య త‌న తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాట‌లో పయ‌నిస్తూ పాన్ ఇండియా స్టార్‌డం సంపాదించుకున్నారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో బాల‌య్య‌, జూనియర్ ఎన్టీఆర్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌నేది అంత‌టా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద జూనియ‌ర్ ఫ్లెక్సీలు క‌డితే వాటిని తీయించారు బాల‌య్య‌. ఇత‌ర సంద‌ర్భాల‌లో కూడా వారిరివురు అంటీముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు. అయితే వారిద్ద‌రితో మంచి సాన్నిహ‌త్యంగా ఉంటున్నాడు విశ్వ‌క్ సేన్.

మొదటి నుంచి విశ్వక్ సేన్‌కి నందమూరి హీరోలు అంటే పిచ్చి అభిమానుం. బాలకృష్ణకు హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్న విశ్వ‌క్ సేన్ తన సినిమాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రతిసారి బాలయ్యను ఆహ్వానిస్తుంటారు. పలు సందర్భాల్లో బాలకృష్ణ.. విశ్వక్ సేన్ గురించి గొప్పగా పొగడటమే కాదు.. తన కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉంటాడని చెబుతూ ఉండేవారు. ఇటీవ‌ల జ‌రిగిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక కి కూడా ముఖ్య అతిథిగా బాల‌య్య హాజ‌ర‌య్యారు. ఆ వేడుక‌లో . ‘విశ్వక్ నేనూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో నాకు కొంతమందితోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. వారిలో విశ్వక్ సేన్ ఒకరు అని చెప్పారు. త‌న మాదిరిగానే విశ్వ‌క్ కూడా ఎప్పుడు కొత్త‌ద‌నం చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తాడ‌ని అన్నారు.

మరోవైపు విశ్వక్ సేన్.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోను మంచి ర్యాపో మెయింటైన్ చేస్తాడు. దాస్ కా ధ‌మ్కీ మూవీ ఈవెంట్ కి జూనియ‌ర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వ‌చ్చి విశ్వ‌క్‌ని తెగ పొగిడేశాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొని విశ్వక్ గురించి గొప్పగా మాట్లాడారు. ఆ మధ్య బేబీ సినిమాకు సంబంధించిన వివాదంలో విశ్వక్ సేన్ పై ప‌లు విమ‌ర్శ‌లు రాగా, ఆ స‌మ‌యంలో త‌న‌వంతూ స‌పోర్ట్ అందించారు. మొత్తానికి ఇద్ద‌రు నంద‌మూరి హీరోల‌ని ప్ర‌సన్నం చేసుకున్న విశ్వక్ సేన్ కెరియ‌ర్‌లో మ‌రింత ముందుకు పోవ‌డం ఖాయం అంటున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు