Wednesday, January 1, 2025
HomeSportsRohit Sharma|రోహిత్ కోసం మైదానంలోకి వ‌చ్చిన అభిమాని.. చుక్క‌లు చూపించిన పోలీసులు

Rohit Sharma|రోహిత్ కోసం మైదానంలోకి వ‌చ్చిన అభిమాని.. చుక్క‌లు చూపించిన పోలీసులు

Rohit Sharma| పొట్టి ప్ర‌పంచ క‌ప్‌కి ముందు భార‌త్ -బంగ్లాదేశ్ మ‌ధ్య వార్మ‌ప్ మ్యాచ్ జరిగింది. ఈ వార్మ‌ప్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఏకంగా 60 ప‌రుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై ఓపెనింగ్‍కు వచ్చిన సంజూ శాంసన్ (1) ఫెయిల్ అవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (23) కాసేపు అల‌రించాడు. ఇక స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‍లో దుమ్మురేపాడు. 32 బంతుల్లోనే 53 పరుగులు బాది అర్ధ శతకంతో అద‌ర‌గొట్టాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల ఉన్నాయి. ఇక సూర్య కుమార్ యాదవ్ (18 బంతుల్లో 31 పరుగులు) వేగంగా ఆడాడు.

శివమ్ దూబే 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. 15వ ఓవర్లో ఔటయ్యాడు. చివర్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హిట్టింగ్‍తో అదరగొట్టాడు. ఐపీఎల్‍లో పెద్దగా రాణించలేకపోయిన హార్దిక్.. ఈ మ్యాచ్‍తో ఫామ్‍ను అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్(2/12), శివమ్ దూబే(2/10) నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు ప‌రుగులు పెద్ద‌గా చేయ‌లేక‌పోయారు. 20 ఓవ‌ర్ల‌కి గాను 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 122 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గలిగారు. ఇక ఇదిలా ఉంటే భారత్- బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ జరుగుతుండగా.. సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలో ఉన్న‌ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వచ్చి హ‌గ్ చేసుకున్నాడు.

అంతలోనే అప్రమత్తమైన పోలీసులు.. మైదానంలోకి దూసుకొచ్చి సదరు అభిమానిని నేలపై పడుకోబెట్టి చావాబాదారు. రోహిత్ శర్మ వద్దని చెబుతున్నా.. అమెరికా పోలీసులు వినిపించుకోకుండా అత‌నిని కొట్టారు. అయితే చివరకు మ్యాచ్ నిర్వాహకుల్లోని ఒకరు వచ్చి రోహిత్ రిక్వెస్ట్‌ను పోలీసులకు తెలియజేయగా పైకి లేపి మైదానం బయటకు తీసుకొచ్చారు. సదరు అభిమానిని రక్షించేందుకు రోహిత్ శర్మ చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. అభిమానులకు రోహిత్ ఎప్పుడూ అండగా ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు