Saturday, January 4, 2025
HomeTelanganaKCR | కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం

KCR | కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం

* కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం

* ఎంబీబీఎస్ చదివించిన కేసీఆర్ పీజీ కోర్సుకు కి కూడా ఆర్థిక మద్దతు..
* ⁠కిష్టయ్య కుటుంబం తో కలిసి భోజనం చేసిన కేసీఆర్
* ⁠కుటుంబ బాగోగుల పరామర్శ

* అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండి – కిష్టయ్య పిల్లలకు బాధ్యత గుర్తు చేసిన కేసీఆర్

* మమ్మల్ని ఆదుకుంటూ..కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. – ధన్యవాదాలు తెలిపిన కిష్టయ్య కుటుంబం
* మమ్ముల కంటికి రెప్పలా కాపాడుతున్నరు- కిష్టయ్య కొడుకు
* అమరుల త్యాగాలతోనే తెలంగాణ – కేసీఆర్ పునరుద్ఘాటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు.
కిష్టయ్య ప్రాణత్యాగం తో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువు తో సహా ప్రతి కష్టకాలం లో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కేసీఆర్ గారు, నాడు కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్ వైద్య విద్యకోసం అవసరమైన ఆర్థికసాయం అందించారు. నాడు ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతున్నది. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును నేడు నంది నగర్ లో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు.

అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు.
వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.

“ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్న పిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది, చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలో నైనా నా సహకారం ఉంటూనే ఉంటుంది.” అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు.

ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా అదుకుంటున్న కేసీఆర్ కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

కాగా…
తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరులను తమ ప్రభుత్వం లో ఆదుకున్నామని అదే స్ఫూర్తిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా అమరుడు పోలీస్ కిష్టయ్య భార్య పద్మావతి మాట్లాడుతూ…

“నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తి అయింది. మా నుండి పోలీస్ కిష్టయ్య(మా భర్త) దూరమై 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని నా తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చాడు. “నీవు బాధ పడకమ్మా…నీ పిల్లలను నేను చూసుకుంటా” అన్నరు. వారిచ్చిన మాట ప్రకారమే..మా పిల్లలకు మా కుటుంబానికీ అన్ని విధాలా అండగా ఉన్నారు. నా బిడ్డ మెడికల్ కాలేజి లో చదువుకు డబ్బులు ఇస్తున్నారు. 6వ తరగతి నుండి ఇప్పటి వరకు అన్ని విధాలా అసరాను అందిస్తున్నారు.” అని తెలిపింది.

ఈ సందర్భంగా..పోలీస్ కిష్టయ్య కొడుకు రాహుల్ మాట్లాడుతూ… “ మేము 6వ తరగతి లో ఉన్నప్పుడు మా నాన్న తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసి చనిపోయారు. మాకు ఊహ తెల్వని సమయంలోనే మా నాన్న చనిపోయారు. “బాధపడకమ్మా నీకుటుంబానికి నేను అండగా ఉంటానని” ఆనాడు మా అమ్మకు మాట ఇచ్చారు కేసీఆర్ గారు.
అప్పుడు వారు మాట ఇచ్చిన ప్రకారమే మమ్ములను చూసుకుంటున్నాడు.
చెల్లెలు మెడిసిన్ చేయించారు.ఇవాళ పీజీ కోసం మళ్ళీ డబ్బులు ఇచ్చారు.
మాకు అన్ని విధాలా అండగా ఉన్నారు.
మమ్ములను కంటికి రెప్పలా మమ్ములను చూసుకుంటున్నాడు. మా అమ్మకు ఒక్క తండ్రి లెక్క కేసీఆర్ గారు అన్ని విధాలా అండగా ఉన్నారు.మా నాన్న కల నెరవేరింది. కానీ మా మధ్య మా నాన్న లేకపోవడం బాధగా ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది.మా నాన్న ఉంటే ఇంకా బాగుండు అని ఉంది..” అని తన మనసులో మాట చెప్పారు.

RELATED ARTICLES

తాజా వార్తలు