Saturday, January 4, 2025
HomeTelanganaనాగాలాండ్ లో తెలంగాణ సంబురాలు

నాగాలాండ్ లో తెలంగాణ సంబురాలు

(‘జనపదం’ ప్రతినిధి)
తెలంగాణ సుసంపన్న చరిత్ర, సజీవ సంస్కృతి, గణనీయమైన ప్రగతి దేశ నిర్మాణానికి ఎంతో తోడ్పడింది అని నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ప్రశంసించారు.
నాగాలాండ్ రాజధాని కోహిమలోని రాజ్ భవన్ లో జూన్ రెండవ తేదీ ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సౌహార్ద పూరితంగా ఆనందోత్సాహాలతో జరిగాయి.
తాము తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తిస్తున్నామని, గౌరవిస్తున్నామని గవర్నర్ గణేశన్ ప్రశంసించారు. వైవిధ్యం గల ప్రజలు అందరినీ భారతీయుల మనే భావన కలిపేస్తున్నదని ఆయన అన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత సాగిస్తున్న ప్రయాణం, సాధించిన ప్రగతి తెలంగాణ సత్తువను, పట్టుదలను , సాంస్కృతిక సంపన్నతను సూచిస్తున్నదని గణేశన్ కొనియాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ వారు ప్రదర్శించిన ఆటాపాటా కు గవర్నర్ ముగ్ధులయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయ పడ్డారు.
గత ఏడాది కూడా తెలంగాణ ఆవిర్భావ సంబురాలు రాజ్ భవన్లో జరుపుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ నాగాలాండ్ ప్రజల మధ్య సుహ్రృద్భావం మరింత బలపడుతుందనే ఆకాంక్ష ను వ్యక్తం చేశారు. నాగాలాండ్ లో నివసిస్తున్న తెలంగాణ వారు దేశ సంస్కృతి ని సుసంపన్నం చేస్తున్నారని గవర్నర్ అభినందించారు. కోహిమ, దిమాపూర్ లలో నివసిస్తున్న తెలంగాణ వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నాగాలాండ్, తెలంగాణ ప్రజల మధ్య సంఘీభావం ఎంతోకాలంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు నాగాలాండ్ ప్రజలు మద్దతు తెలిపారు.

RELATED ARTICLES

తాజా వార్తలు