Wednesday, January 1, 2025
HomeNationalఅరుణాచల్ లో బీజేపీ, సిక్కిం లో ఎస్ కె ఎం

అరుణాచల్ లో బీజేపీ, సిక్కిం లో ఎస్ కె ఎం

(‘జనపదం’ ప్రతినిధి)
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. కాగా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షం సిక్కిం క్రాంతికార్ మోర్చా గెలిచింది.
లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల కు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరిగింది. ఒడిశా, ఏపీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగవ తేదీన లోక్ సభ తోపాటు జరుగుతుంది.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జూన్ 2 ఆదివారం జరిగింది.
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ లో 60 స్థానాలు ఉండగా, బీజేపీ 46 గెలుచుకుంది. 2019 ఎన్నికల తో పోలిస్తే బీజేపీ బలం మరో ఐదు పెరిగింది. ముఖ్య మంత్రి పెమ ఖండు, ఉప ముఖ్యమంత్రి చౌన మెయిన్ తోపాటు దాదాపు పదిమంది బీజేపీ అభ్యర్థులు, పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు, కాంగ్రెస్ ఒక స్థానాలు గెలుచుకున్నాయి.
సిక్కిం అసెంబ్లీ లో మొత్తం 32 స్థానాలు ఉండగా, సిక్కిం క్రాంతికార్ మోర్చా 31 సీట్లు గెలుచుకుంది. మిగతా ఒక స్థానం సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కు దక్కింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికార్ మోర్చా 17 సీట్లలో మాత్రమే గెలిచింది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు