Sunday, December 29, 2024
HomeNationalSofia Firdous | ఒడిశాలో స‌రికొత్త చ‌రిత్ర‌.. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన ముస్లిం మ‌హిళ‌

Sofia Firdous | ఒడిశాలో స‌రికొత్త చ‌రిత్ర‌.. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన ముస్లిం మ‌హిళ‌

Sofia Firdous | భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో అసెంబ్లీలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది ఓ ముస్లిం మ‌హిళా. స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒడిశా అసెంబ్లీకి ముస్లిం మ‌హిళా ఎన్నిక కాలేదు. కానీ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓ ముస్లిం మ‌హిళా.. బీజేపీ అభ్య‌ర్థిపై గెలిచి రికార్డు క్రియేట్ చేశారు.

ఒడిశాలోని క‌ట‌క్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై సోఫియా ఫిర్దోస్ బ‌రిలో నిలిచారు. ఆమెపై బీజేపీ అభ్య‌ర్థి సూర్ణ చంద్ర మ‌హాపాత్ర పోటీ చేశారు. 8,001 ఓట్ల మెజార్టీతో మ‌హాపాత్ర‌పై ఫిర్దోస్ విజ‌యం సాధించారు. క‌టక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఫిర్దోస్ తండ్రి మ‌హ్మ‌ద్ మోఖిం మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేగా కొన‌సాగ‌నున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మ‌హ్మ‌ద్ త‌న స్థానాన్ని బిడ్డ‌కు క‌ట్ట‌బెట్టారు.

ఒడిశాలో 24 ఏండ్ల నవీన్ ప‌ట్నాయ‌క్ పాల‌న‌కు బీజేపీ బ్రేకులు వేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశౄలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఐ(ఎం) 1, ఇత‌రులు మూడు స్థానాల్లో గెలుపొందారు.

RELATED ARTICLES

తాజా వార్తలు