Bala Krishna| నందమూరి బాలయ్యకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజలకి సేవ చేస్తూ అందరి గుండెలలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. ఇప్పటికే హిందూపురం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఈ సారి కూడా ఏపీ ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది వరుసగా మూడో గెలుపు కావడంతో బాలయ్యతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టడంతో ఆయనని అభిమానించే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.
సాధారణంగా బాలయ్య సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తుంటారో మనం చూస్తూనే ఉన్నాం. పాలాభీషేకాలు.. జంతుబలులలు, డాన్స్ లు.. ఊరేగింపులు కామన్ గా జరిగేవే. కాని ఈసారి మాత్రం కాస్త డిపరెంట్ గా చేశారు బాలయ్య ఫ్యాన్స్.. అందరు ముక్కున వేలు వేసుకునేలా హిందూపురంలో బాలయ్య కటౌట్లకు పొటేలు తలకాయల దండలు వేసి.. షాక్ ఇచ్చారు. బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ హిందూపురంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీకి గజమాలతో పాటు పొట్టేలు తలకాయలతో తయారుచేసిన దండ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మటన్ షాప్ కి వెళ్లి పొట్టేలు తలకాయలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాటిని దండగా కట్టి బాలయ్య ఫ్లెక్సీకి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, వాటికి అభిమానులు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు మాత్రం అటు సినిమాలు.. ఇటు రాజకీయం రెండు రకాలుగా దూసుకుపోతున్నారని ఆయనకి ఇక తిరుగే లేదని చెబుతున్నారు.