Abhishek nayar| క్రికెటర్స్ భావోద్వేగాలు పలు రకాలుగా ఉంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. గెలిస్తే ఒక రకమైన సంతోషం, ఓడితే మరో భావోద్వేగం వారు చూపిస్తూ ఉంటారు. రకరకాల ఎమోషన్స్‌తో వారు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే క్రికెటర్స్ జీవితంలో సె*క్స్ ఉంటుందా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంటుంది. దీని గురించి యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ కరున్ నాయర్‌ను అడగాడు. దానికి ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ముందుగా అభిషేక్ నాయర్ ఈ ప్రశ్నని పాజిటివ్‌గా అడుగుతున్నారా లేకుంటే నెగెటివ్‌గా అడుగుతున్నారా అని ప్రశ్నించాడు.
సె*క్స్ లేకుండా ఏ మానవుడు మనుగడ సాగిస్తాడు? క్రికెట్‌లో సె*క్స్ మంచిదా? చెడ్డదా? అనేదేనా మీ ప్రశ్న? అసలు మీ ప్రశ్న ఉద్దేశం ఏంటి? సె*క్స్ చేయడం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో కామన్. కాకపోతే అది ఆటగాళ్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. సెక్స్ విషయంలో ఆటగాళ్ల వైఖరి భిన్నంగా ఉంటుంది. కొందరు మ్యాచ్‌కి ముందు సెక్స్ చేస్తే, మరి కొందరు మ్యాచ్ తర్వాత చేస్తారు. ఇంకొందరు మ్యాచ్‌లు పూర్తయ్యే వరకు అస్సలు చేయరు. సె*క్స్ చేయకపోతే వారి శక్తి మరింత పెరగడంతో పాటు ఆటపై ఫోకస్ ఎక్కువగా పెరుగుతుందని కొందరు విశ్వసిస్తారు. మరికొందరు మాత్రం సె*క్స్ చేస్తే రిలీఫ్ లభిస్తుందని భావిస్తారు. ఇది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. సె*క్స్ చేయాలని, చేయవద్దని క్రికెటర్లకు ఎలాంటి నియమం లేదు.
వాస్తవం ఏంటంటే.. జీవితంలోని వివిధ దశల్లో వివిధ విషయాలు పనిచేస్తాయి. కొన్ని సార్లు ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వాళ్లు చిల్ అవ్వడానికి సె*క్స్ ఉపయోగపడుతుంది.’అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు. విదేశీ ఆటగాళ్లు సె*క్స్ విషయంలో పలుమార్లు ఓపెన్‌గా మాట్లాడిన భారత ఆటగాళ్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించింది లేదు. కాగా, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ భార్య సైతం మ్యాచ్‌కి ముందు తన భర్త ఆ కోరిక కోరితే అతనికి సహకరిస్తానంటూ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే.