Adah Sharma| పైకి చూడడానికి చాలా అందంగా ఉండే ముద్దుగుమ్మలు లోలోపల అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ బయటకి చాలా ధైర్యంగా కనిపిస్తుంటారు. అయితే సమయం వచ్చినప్పుడు మాత్రమే తమ సమస్యల గురించి చెప్పి పెద్ద షాకులు ఇస్తుంటారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ఆదా శర్మ ఓ ఇంటర్వ్యూలో తనకు అరుధైన వ్యాధి ఉందని, దాని వలన ఇబ్బదులు పడుతున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.
అదా తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాలు చేసిన ఏ చిత్రం కూడా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకురాలేదు. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ది కేరళ స్టోరితో’ అదా శర్మ ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అదా బస్తర్ ‘ది నక్సల్ స్టోరీ’ మూవీలో నటించింది. ఇక ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడి పేరు అందరి నోళ్లలో నానుతుంది. అయితే అదాశర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరుదైన వ్యాధి వచ్చిందనే షాకింగ్ విషయాలను బయట పెట్టింది. పైగా అది కూడా సినిమాల వల్లనే అని పేర్కొంది.
ది కేరళ స్టోరి మూవీలో నటించనప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత బస్తర్ ది నక్సల్ మూవీలో నటించినప్పుడు బరువు పెరగాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆ సినిమాలో బరువైన గన్లను మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటుగా కాస్త బలంగా ఉండడానికి 10 నుంచి 12 వరకు అరటి పండ్లు తిన్నాను. అలాగే గింజలు, డ్రై ఫ్రూట్స్ ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలను నాతో పాటు షూటింగ్ కు తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డులు తినేదాన్ని. కానీ ఇప్పుడు మళ్లీ బార్ సినిమా కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం, మళ్లీ పెరగడం, ఆ తర్వాత తగ్గడం వలన ఎండోమెట్రియోసిస్ వ్యాధి వచ్చింది. దాని వలన దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డాను అని ఆదా చెప్పుకొచ్చింది.