Sunday, December 29, 2024
HomeCinemaNBK 109| బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాల‌య్య ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. గ్లింప్స్ అదుర్స్

NBK 109| బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాల‌య్య ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. గ్లింప్స్ అదుర్స్

NBK 109| ఈ రోజు నంద‌మూరి బాల‌కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల‌లో ఆయ‌న జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. అన్న‌దానాలు, రక్త‌దానాలు చేసుకుంటూ బాల‌య్య‌పై అభిమానం చాటుకుంటున్నారు. ఇదే క్ర‌మంలో ఫ్యాన్స్‌కి ఆనందం అందించేందుకు బాల‌య్య డ‌బుల్ ట్రీట్ ఇచ్చారు. బోయపాటి శ్రీనుతో చేయాల్సిన సినిమా ప్రకటన ఈ ఉద‌యం వచ్చింది. సినిమాని ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేశారు. `అఖండ` తరహాలోనే అది ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మరో ట్రీట్‌ వచ్చింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న `ఎన్బీకే109` గ్లింప్స్ విడుద‌ల చేశారు.

నిమిషం పాటు సాగే ఈ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. బాలయ్య పాత్ర ఎలివేషన్‌ చూపించేలా ఈ గ్లింప్స్ సాగింది. మంచు పొగలో విలన్లు కత్తులు పట్టుకుని ఎవరినో వేటాడటానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో `దేవుడు మంచి వాడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతూ చూడాలంటే కావాల్సింది జాలి, దయా, కరుణ, ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు` అంటూ మకరంద్‌ దేశ్‌ పాండే చెప్ప‌డం బాల‌య్య ఎలివేష‌న్ గురించే అని అర్ధ‌మ‌వుతుంది. ఓ రైల్వే స్టేషన్‌ వద్ద అదే మంచు పొగలో నుంచి బాలకృష్ణ నడుచుకుంటూ వస్తుండ‌డం, . ఒక చేతిలో బ్యాగు, మరో చేతిలో పెట్టె ఉంటుంది. బాల‌య్య లుక్ చూసి ప్ర‌తి ఒక్కరు ఆశ్చర్య‌పోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్‌ తమన్ బాణీలు అందిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు