Sunday, December 29, 2024
HomeCinemaKalki 2898 AD| ప్ర‌భాస్ క‌ల్కి ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్‌లో ఉందిగా..!

Kalki 2898 AD| ప్ర‌భాస్ క‌ల్కి ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్‌లో ఉందిగా..!

Kalki 2898 AD| ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్ర‌భాస్ అభిమానులు గత కొన్ని రోజులుగా క‌ల్కి సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెంచేసింది. ఇందులో కొత్త ప్ర‌పంచం, స‌రికొత్త ఆయుధాలు చూపించారు. ట్రైల‌ర్ మొత్తం ఆస‌క్తికరంగా సాగింది. ప్రభాస్ వాహనం బుజ్జికి సంబంధించిన దృశ్యాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించాయి.

ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ లొ చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. భారీ స్థాయిలో ఉన్న మెషీన్స్, ఆయుధాలు, నౌకలు అబ్బురపరుస్తున్నాయి. ఆ తర్వాత అమితాబచ్చన్ పోషిస్తున్న అశ్వథామ పాత్ర పరిచయం జరుగుతుంది. నీలాంటి వాడు ఎంతమందిని రక్షించ వచ్చో తెలుసా అని ఓ కుర్రాడు అడుగుతాడు. దీనికి అమితాబ్ నేను రక్షించాల్సింది ఒక్కడినే అని బదులిస్తాడు. ఆరువేల సంవత్సారాల క్రితం కనిపించిన శక్తి మళ్ళీ రాబోతున్నట్లు రాజేంద్ర ప్రసాద్ ఒక వ్యక్తిని చెబుతుంటాడు. ఇక వెలుగు వచ్చే సమయం అయింది అని అంటాడు.

ఆ తర్వాత దీపికా పదుకొనె పాత్ర పరిచయం ఉంటుంది. ఆమె ఓ బిడ్డని కనేందుకు రెడీగా ఉంటుంది. ట్రైలర్ లో ఎక్కువగా ఏదో కాంప్లెక్స్ అనే పదం వినిపిస్తోంది. ప్రభాస్ దాని గురించి కలలు కంటుంటాడు. ఫన్నీగా ప్రభాస్ పాత్ర పరిచయం జరిగినప్పటికీ ఆ తర్వాత పవర్ ఫుల్ గా మారుతాడు. ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో పాటు హాలీవుడ్ రేంజ్‌లో ఉంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూవీని జూన్ 27న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ట్రైల‌ర్‌తోను క‌న్‌ఫాం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు