Wednesday, January 1, 2025
HomeNationalజులై 10 న ఉపఎన్నిక‌లు

జులై 10 న ఉపఎన్నిక‌లు

జులై 10 న ఉపఎన్నిక‌లు

లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌భావం నుంచి తేరుకోక‌ముందే వివిధ రాష్ట్రాల‌లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. అభ్య‌ర్థుల మ‌ర‌ణం లేదా రాజీనామా కార‌ణాల వ‌ల్ల ఈ ఉప ఎన్నిక‌ల అవ‌సరం ఏర్ప‌డింది. జులై 10వ తేధీన ఏడు రాష్ట్రాల‌లోని 13 స్థానాలకు పోలింగ్ జ‌రిగే విధంగా ఈ నెల 10వ తేధీనాడు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న చేసింది. బీహార్ లోని రూపాలి, త‌మిళ‌నాడులోని విక్ర‌వంది, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని అమ‌ర్ వ‌రా, పంజాబ్ లోని ప‌శ్చిమ జ‌లంధ‌ర్ స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ప‌శ్చిమ బెంగాల్ లోని నాలుగు స్థానాలు – రాయ్ గంజ్, రాణాఘాట్ ద‌క్షిణ్, వాగ్ధా, మ‌ణిక్ త‌లా స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌రుగుతుంది. ఉత్త‌రాఖండ్ లోని బద్రీనాధ్, మంగ్ లార్ స్థానాల‌కు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని డెహ్రా, హ‌మీర్ పూర్, నాలా ఘ‌డ్ స్థానాల‌కు కూడా ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈ మేర‌కు ఈ నెల 14న నోటిఫికేష‌న్ జారీ కానుంది. జులై 13న లెక్కింపు జ‌రుగుతుంది.
త్వ‌ర‌లో జ‌మ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు