Saturday, January 4, 2025
HomeNational24 నుంచి కొత్త లోక్ స‌భ‌

24 నుంచి కొత్త లోక్ స‌భ‌

24 నుంచి కొత్త లోక్ స‌భ‌

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో కొత్త లోక్ స‌భ ఈ నెల 24 వ తేధీన ప్రారంభం కానుంది. జులై 3 వ తేధీ వ‌ర‌కు స‌మావేశాలు కొన‌సాగుతాయి. ప్ర‌ధానిగా 3వ సారి మోదీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కానీ ఈ సారి బిజెపి మెజారిటి కోల్పోయి ఇత‌ర ప‌క్షాల స‌హాయంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. మ‌రో వైపు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూట‌మి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా అవత‌రించింది. దీంతో ఈ లోక్ స‌భ స‌మావేశాలు ప్రాధాన్యం ఏర్ప‌డింది. 24 నుంచి లోక్ స‌భ స‌మావేశాలు ప్రారంభ‌వుతున్నాయ‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిరెన్ రిజిజు X (ట్విట్ట‌ర్) వేదిక‌గా వెళ్ల‌డించారు. మొద‌ట కొత్త‌గా ఎన్నికైన ప్ర‌తినిధులు ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత స్పీక‌ర్ ఎన్నిక జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి 3 రోజులు ప‌డుతుంది. ఉభ‌య స‌భ‌ల సంయుక్త స‌మావేశాన్ని ఉద్దేశించి జూన్ 27వ తేధీన రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగిస్తారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ము ప్ర‌సంగంలో కొత్త ప్ర‌భుత్వ విధాన ప‌ర‌మైన వివ‌రాలుంటాయి. ఆ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపే తీర్మానం పై చ‌ర్చ ఉంటుంది. అధికార పార్టీకి మెజారిటి ఉంటుంది క‌నుక ఈ తీర్మానం ఆమోదం పొందుతుంది. కాని బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉండ‌డం వ‌ల‌న చ‌ర్చ‌లు ఆస‌క్తిక‌రంగా సాగ‌వ‌చ్చు. ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన అంశాల‌కు స‌మాధానంగా ప్ర‌ధాని ప్ర‌సంగం ఉంటుంది. జూన్ 27వ తేధీన రాజ్య‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌వుతాయి. జులై 3వ తేధీన పార్ల‌మెంటు స‌మావేశాలు ముగుస్తాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు