Wednesday, January 8, 2025
HomeTelanganaCM Delhi Tour | నితిన్ గ‌డ్క‌రీతో భేటీ

CM Delhi Tour | నితిన్ గ‌డ్క‌రీతో భేటీ

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కీలకమైన రహదారుల విస్తరణలో రాష్ట్రానికి అవసరమైన చేయూతను అందించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. 2024-25 వార్షిక ప్రణాళికలోనే ఈ రహదారులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.

☑️ తెలంగాణ ఉత్తర భాగంలో అనుమతించిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు తక్షణమే టెండర్లు పిలవడంతో పాటు దక్షిణ భాగంలో చౌటుప్పల్ – ఆమన్ గల్ – సంగారెడ్డి వరకు 181 కిలోమీటర్ల ప్రతిపాదిత జాతీయ రహదారిని భారతమాల పరియోజన కింద గుర్తించి 2024-25 వార్షిక ప్రణాళిక కింద చేర్చాలి. తద్వారా రీజినల్ రింగ్ రోడ్డుకు పరిపూర్ణత చేకూరుతుంది.

☑️ హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యన నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా మార్చే ప్రాజెక్టును తక్షణం చేపట్టాలి.

☑️ వామపక్ష తీవ్రవాదం కారణంగా మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు, మాజీ స్పీకర్ శ్రీ శ్రీపాదరావు వంటి మహామహులు ప్రాతినిథ్యం వహించిన మంథని మార్గం జాతీయ రహదారి చిత్రపటంలో చోటు దక్కలేదని, జగిత్యాల – పెద్దపల్లి – మంథని – కాటారం 130 కిమీ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తగిన నిధులు కేటాయించాలి.

☑️ జాతీయ రహదారి -163లో భాగంగా హైదరాబాద్ – మన్నెగూడ రహదారి కాంట్రాక్టు పనులు అప్పగించినప్పటికీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాల మేరకు పనులు నిలిచిపోయాయని, వాటిని తక్షణం పరిష్కరించి ఈ నాలుగు లేన్ల రహదారి పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.

☑️ పలు జాతీయ రహదారులకు అనుసంధానం చేయడం, కొన్ని పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జగిత్యాల – పెద్దపల్లి – కాటారం (130 కిమీ), డిండి – దేవరకొండ, మల్లేపల్లి-నల్గొండ (100 కిమీ), భువనగిరి – చిట్యాల (44కిమీ), మరికల్ – నారాయణపేట – రాంసముద్ర (63కిమీ), వనపర్తి – కొత్తకోట – గద్వాల – మంత్రాలయం (110 కిమీ), కరీంనగర్ – సిరిసిల్లా – కామారెడ్డి – ఎల్లారెడ్డి- పిట్లం (165 కిమీ), ఎర్రవల్లి ఎక్స్ రోడ్ – గద్వాల – రాయచూర్ (67 కిమీ), కొత్తపల్లి – జనగాం (75 కిమీ), సారపాక – ఏటూరునాగారం (93 కిమీ), దుద్దెడ – కొమురవెల్లి – యాదగిరిగుట్ట (63 కిమీ), జగ్గయ్యపేట – వైరా – కొత్తగూడెం (100 కిమీ), సిరిసిల్లా – వేములవాడ – కోరుట్ల (65 కిమీ), భూత్పూర్ – నాగర్ కర్నూల్ – మన్ననూరు – మద్దిమడుగు – సిరిగిరిపాడు (166 కిమీ), కరీంనగర్ – రాయపట్నం (60 కిమీ) మొత్తంగా 1617 కిలోమీటర్ల మేరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి.

☑️ అత్యంత ప్రధానమైన హైదరాబాద్ – శ్రీశైలం NH765 మార్గం 187 కిమీ లలో 125 కిమీ పనులను మాత్రమే పునరుద్ధరణ జరిగిందని, మిగిలిన 62 కిమీ రహదారిని ఎలివేటెడ్ కారిడార్ గా 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చాలి.

☑️ హైదరాబాద్ – శ్రీశైలం NH765 మార్గాన్ని కల్వకుర్తి వరకు విస్తరించాలి.

☑️ సేతు బంధన్ పథకం కింద అత్యంత ప్రాధాన్యత కలిగిన 12 రోడ్ ఓవర్ బ్రిడ్జి, రోడ్ అండర్ బ్రిడ్జిలను ప్రస్తుత వార్షిక ప్రణాళికలో చేర్చాలి.

☑️ హైదరాబాద్ నుంచి భద్రాచలం దాదాపు 40 కిమీ దూరాన్ని తగ్గించడంతో పాటు అనేక ప్రయోజనాలున్న హైదరాబాద్ గౌరెల్లి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి వలిగొండ – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లందు – కొత్తగూడెం మధ్య 234 కిమీ మార్గం NH-930Pతో పాటు కల్వకుర్తి – నంద్యాల (ఏపీ) NH-167K పనులకు తక్షణం టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలి.

RELATED ARTICLES

తాజా వార్తలు