Saturday, April 5, 2025
HomeHealthRevant Reddy: కాన్సర్ వ్యాధి బాధిత బాలునికి రేవంత్ రెడ్డి భరోసా

Revant Reddy: కాన్సర్ వ్యాధి బాధిత బాలునికి రేవంత్ రెడ్డి భరోసా

కాన్సర్ వ్యాధి బాధిత బాలునికి రేవంత్ రెడ్డి భరోసా

వరంగల్ లో తనను  కలవలేకపోయిన క్యాన్సర్ బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్ ఉదంతంపై  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు.  సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ బాలుడి కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. నెల రోజుల క్రితం అదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కి లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేసింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితి పై  వేముల శ్రీనివాస్ ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కావాల్సిన మరింత సాయం అందిస్తామని  ఆయన అదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు