Saturday, January 4, 2025
HomeNationalVaddiraju: ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో ప్రసంగం

Vaddiraju: ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో ప్రసంగం

ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో ప్రసంగం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుపరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో సాధించిన అద్భుతమైన ప్రగతిని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చాలా స్పష్టంగా వివరించారు
దేశంలో చిన్న రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఏర్పడిన పదేళ్ల స్వల్ప కాలంలోనే గొప్పగా అభివృద్ధి చెందిన తీరును పార్లమెంట్ సాక్షిగా ఎంపీ రవిచంద్ర యావత్ దేశం ముందు సవివరంగా ఆవిష్కరించారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం ఎంపీ వద్దిరాజు మాతృభాష తెలుగులో చక్కగా మాట్లాడారు
  • 18లోకసభ కొత్తగా కొలువుదీరిన సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు భారత రాష్ట్ర సమితి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు
  • తనను రాజ్యసభకు రెండో సారి పంపిన భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు
  • భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామి కావడం మాకెంతో గర్వకారణం
  • దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు, రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలకు చేరువ అవుతున్న సందర్భంగా దేశం సుసంపన్నంగా ఎదగడానికి తెలంగాణ ఎంతగానో దోహదపడిందని చెప్పడానికి సంతోషిస్తున్న
  •  సొంత రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమ నేత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి పర్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు
  • తెలంగాణ ప్రగతి నమూనాను కేసీఆర్ గారు ఆవిష్కరించారని చెప్పడం ఆనందంగా ఉంది
  • ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 11నుంచి 5వ స్థానానికి రావడం అభినందనీయం
  • ఈ విధంగా దేశం మరింత బలోపేతం కావాలని ఆశిస్తున్న,అవుతుందని కోరుకుంటున్న
  • త్వరలో ప్రవేశపెట్టనున్న జాతీయ బడ్జెట్ సకల జనులకు మేలు చేకూర్చే విధంగా ఉంటుందని గాఢంగా విశ్వసిస్తున్న
  • చిన్న రాష్ట్రాలకు సక్సెస్ ఫుల్ మాడల్ గా తెలంగాణ నిలిచింది
  • IT ఎగుమతులు 4రెట్లు, ఉద్యోగాలు 3రెట్లు,స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు పెరగడం జరిగింది
  • కేసీఆర్ సారథ్యంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి నిజంగా ఒక స్వర్ణయుగమనే చెప్పాలి
  • సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అరిగోస పడింది
  • తెలంగాణ ప్రజల జీవితాలు ఇంతేనా అనే దగ్గర నుంచి దేశంలోనే తెలంగాణ ప్రజల బాగు చూడండని అనే అంతగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించింది
  • ఆయన పాలనలో అమలు చేసిన కొన్ని బృహత్తర పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయి
  • నేడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న “కిసాన్ సమ్మాన్ నిధి”,”హర్ ఘర్ జల్” వంటి పథకాలు.. కేసీఆర్ ప్రవేశపెట్టిన “రైతుబంధు”,”మిషన్ భగీరథ” నామూనాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
  • ఇలాంటి గొప్ప పథకాలను చాలా ప్రవేశపెట్టి అమలు చేశారు కేసీఆర్
  • ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలు సాగులోకి తీసుకువచ్చారు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలోని కొంత భాగం సాగులోకి వచ్చేలా ప్రతిష్టాత్మకంగా సీతారామ ప్రాజెక్టు పనులను 90%పూర్తి చేశారు
  • సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ వారం కిందట విజయవంతమైంది
  • ఈ ప్రాజెక్టుతో సుమారు 11లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఉండవు
  • IT ఢమాల్ అవుతుందన్న వాళ్ల నోళ్లను మూయిస్తూ తెలంగాణ IT కొత్త శిఖరాలను అధిరోహించింది
  • సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ లో కొన్ని IT కంపెనీలు ఉన్నప్పటికీ
  • విద్యుత్ కోతలతో IT ఉత్పత్తులు,ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలిగేది
  • దీంతో బెంగళూరు వంటి నగరాలకు IT కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఏర్పడేది
  • దీంతో 2014లో KCR Gaaru అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాల కల్పన,నిరంతరాయం కరెంట్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు
  • కొత్త స్టార్టప్ ల ఏర్పాటుకు నైపుణ్య శిక్షణనిచ్చే ఇంక్యుబేటర్స్ ను KCR Gaaru ఏర్పాటు చేయించారు, ఇందుకోసం ప్రోత్సాహకాలు అందించారు
  • ఈ విధంగా దేశానికి IT HUBగా హైదరాబాద్, తెలంగాణ మారింది
  • IT ఎగుమతులు 2014లో రూ. 66 వేల 276కోట్లు నుంచి కేసీఆర్ కృషితో 2023 నాటికి రూ.2 లక్షల 41వేల 275కోట్లు చేరడం జరిగింది
  • తొమ్మిదేళ్లలో IT ఉద్యోగాలు 2014లో 3లక్షల71వేల 774కాగా,2023లో 9లక్షల 5వేల715కు పెరిగాయి
  • IT ఉద్యోగాల పెరుగుదల 143%పెరిగాయి
  • ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్థానం పొందిన గూగుల్, అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్,మెక్రోసాఫ్ట్ వంటి 20కిపైగా బహుళజాతి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి
  • IT రంగం అభివృద్ధితో దానిపై ఆధారపడిన ఇతర రంగాలు ఎంతగానో లాభపడ్డాయి
  • ఒక్క IT ఉద్యోగం సృష్టితో పరోక్షంగా మరో 4ఉద్యోగాలు వస్తాయంటారు
  • తెలంగాణలో IT వృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వినోదం, రవాణా, లాజిస్టిక్ రంగాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి
  • ప్రత్యక్షంగా,పరోక్షంగా సుమారు 20లక్షల మంది ఉపాధి అవకాశాలు దక్కాయి
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 3స్టార్టప్ ఇంక్యుబేటర్స్,200స్టార్టప్ కంపెనీలు మాత్రమే ఉండేవి
  • అవి 2023నాటికి 77 ఇంక్యుబేటర్స్,7వేలకు పైగా స్టార్టప్ లకు పెరిగాయి
  • తెలంగాణ తలసరి ఆదాయం 2014లో రూ.93 వేల 151నుంచి కెసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలతో 2023 నాటికి రూ.3లక్షల12వేల 397 కు ఎదిగింది
  • ఈ విధంగా తలసరి ఆదాయం 235%పెరిగింది
  • జీఎస్డీపీ విషయానికొస్తే 3లక్షల 79కోట్లు ఉంటే 2023నాటికి 13లక్షల 28వేల కోట్లకు పెరిగింది
  • ఈవిధంగా జీఎస్డీపీ 251%నమోదైంది
  • స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేసీఆర్ దూరదృష్టితో తొమ్మిన్నరేండ్లలోనే 150%పెరిగి సుమారు 7.8గిగావాట్ల నుంచి 19.5గిగావాట్లకు చేరింది
  • వ్యవసాయ రంగంలో కేసీఆర్ తీసుకువచ్చిన సంస్థరణలతో 2014లో ధాన్యం ఉత్పత్తి 68లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2023నాటికి 3కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది
  • ఈవిధంగా కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా, బంగారు తెలంగాణగా గణుతికెక్కింది
  • తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలి
  • ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలి
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి, పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బైలదిల్ల గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని కేటాయించాలి
  • IIM ను వెంటనే మంజూరు చేయాలి
RELATED ARTICLES

తాజా వార్తలు