Thursday, January 2, 2025
HomeNationalPM Modi: సుధా మూర్తి ప్ర‌సంగంపై మోదీ ప్ర‌శంస‌లు…

PM Modi: సుధా మూర్తి ప్ర‌సంగంపై మోదీ ప్ర‌శంస‌లు…

సుధా మూర్తి ప్ర‌సంగంపై మోదీ ప్ర‌శంస‌లు…

న్యూ ఢిల్లీ : రాజ్య‌స‌భ ఎంపీ సుధామూర్తిపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై ఆయ‌న మాట్లాడుతూ.. సుధామూర్తి త‌న ప్ర‌సంగంలో స్త్రీల ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌హిళ‌ల ఆరోగ్యం గురించి స‌వివ‌రంగా మాట్లాడిన సుధామూర్తికి థ్యాంక్స్ చెబుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. ఆ స‌మ‌యంలో సుధామూర్తి లేచి నిల‌బ‌డి ప్ర‌ధానికి న‌మ‌స్క‌రించారు. త‌ల్లుల గురించి కూడా సుధా మూర్తి భావోద్వేగంగా ప్ర‌సంగించిన‌ట్లు మోదీ తెలిపారు. సుధామూర్తి త‌న ప్ర‌సంగంలో మాట్లాడుతూ.. త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు ఆస్ప‌త్రిలో ఒక‌రి మ‌ర‌ణంగా న‌మోదు చేస్తార‌ని, కానీ ఓ కుటుంబానికి ఆ త‌ల్లి ఎప్ప‌టికీ దూర‌మైన‌ట్లే అని పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై మాట్లాడుతూ ఈ విషయాన్నీ ప్రస్తావించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు