Saturday, January 4, 2025
HomeTelanganaHarish Rao: ప‌రిపాల‌న‌ను గాలికి వ‌దిలేశారు: హ‌రీశ్‌రావు

Harish Rao: ప‌రిపాల‌న‌ను గాలికి వ‌దిలేశారు: హ‌రీశ్‌రావు

  • ప్ర‌తీకారం, ప‌గ మీద దృష్టి పెట్టారు.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఫైర్


మెద‌క్ : రాష్ట్రంలో ప‌రిపాల‌న‌ను గాలికి వ‌దిలేశారు.. ప్ర‌తీకారం, ప‌గ మీద దృష్టి పెట్టార‌ని కాంగ్రెస్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌కు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌న్మాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌జా జీవితంలో ప‌ద‌వికి విర‌మ‌ణ ఉంటుంది.. కానీ ప్ర‌జాసేవ‌కు విర‌మ‌ణ ఉండ‌దు అని స్ప‌ష్టం చేశారు. నాయ‌కుడు అనే వాడు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని ఆయ‌న సూచించారు. అలాగే ప్ర‌జా జీవితంలో ప‌ద‌వికి విర‌మ‌ణ ఉంటుంది.. కానీ ప్ర‌జాసేవ‌కు విర‌మ‌ణ ఉండ‌దన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు